సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ హల్‌చల్

5 Jun, 2015 02:34 IST|Sakshi

ఆకట్టుకున్న డిజిటల్ మీడియా స్టాల్
సాక్షి, విజయవాడ బ్యూరో: సోషల్ నెట్‌వర్కింగ్‌లో కొత్త పుంతలు తొక్కుతున్న యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వైఎస్సార్ డిజిటల్ మీడియా విభాగాన్ని ప్రారంభించింది. పార్టీ శ్రేణులకు, ప్రజలకు, యువతకు వైఎస్సార్ డిజిటల్ మీడియా గురించి తెలియజెప్పేలా సమరదీక్షా ప్రాంగణంలో స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఆ పార్టీ డిజిటల్ మీడియా విభాగంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, వెబ్ ఎడిషన్, వెబ్ టీవీ, ఈ పేపర్, మెయిల్ వంటి వాటి ద్వారా పార్టీ విద్యావంతులకు మరింత దగ్గరయ్యే కృషి జరుగుతోంది. ఈ వివరాలతో కార్డులు పంపిణీ చేశారు. యువత ఈ స్టాల్‌ను ఆసక్తిగా చూసి, కార్డులు తీసుకున్నారు.
 
www.ysrcongress.com పేరుతో వెబ్ ఎడిషన్‌లో పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, ప్రకటనలు పెట్టి పార్టీ శ్రేణులకు మార్గ నిర్దేశం చేస్తారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాలు, పార్టీ నాయకత్వ మార్పులు,  మీడియా ప్రకటనలు అందులో ఉంచుతారు.
www.ysrcongress.com/epaperలో ప్రముఖుల వ్యాసాలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ వైఖరి, కార్యక్రమాలు, జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యనేతల పర్యటనలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తారు. ఈ పేపర్, వెబ్‌సైట్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు వీడియో, ఆడియో, రాతపూర్వక సమాచారం కూడా పంపే అవకాశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం ysrcp.digitalmedia @gmail.com  కు మెయిల్ చేయొచ్చు. 9010295617 నంబరుకు వాట్సాప్ మెస్సెజ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లు పంపించవచ్చు.
ఫేస్‌బుక్‌లో వైఎస్సార్‌కాంగ్రెస్ డిజిటల్ మీడియా డాట్‌కామ్‌కు ఇప్పడికే ఐదులక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.
ట్విట్టర్‌లో నేరుగా జగన్ ట్వీట్ చేస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు.
వైఎస్సార్‌సీపీ ఆఫీషియల్ పేరుతో యూ ట్యూబ్ టీవీ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు