కౌలు రైతు ఆత్మహత్య

1 Aug, 2015 20:11 IST|Sakshi

గంగవరం (చిత్తూరు) : అప్పుల బాధతో చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో శనివారం ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంగవరం మండలం ఎల్లంపల్లెకు చెందిన రామప్ప(45) కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పంటల కోసం రూ.4 లక్షల మేర అప్పులు చేశాడు. అతని భార్య రేణుక కూడా డ్వాక్రా రుణాలు తీసుకుంది. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో రేణుక బ్యాంకుకు డబ్బు జమ చేయకుండా ఆపేసింది.

అయితే డబ్బులు కట్టాలంటూ డ్వాక్రా గ్రూపు సభ్యులు ఇటీవల రేణుక భర్త రామప్పను నిలదీశారు. శుక్రవారం రేణుకతో ఘర్షణకు కూడా దిగారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రేణుక తన భర్తతో గొడవకు దిగింది. అనంతరం ఆమె పొలం వద్దకు వెళ్లింది. ఈలోపు రామప్ప ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెవెన్యూ, పోలీసు అధికారులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు