ప్రాణం తీసిన అప్పు

6 Mar, 2019 13:17 IST|Sakshi
ఫ్రీజర్‌లో వెంకటరమణ మృతదేహం, (ఇన్‌సెట్‌) వెంకటరమణ మృతితో అనాథలైన భార్యాపిల్లలు

తీసుకున్న అప్పు చెల్లించని బావమరిది

రుణదాతల ఒత్తిళ్లతో బలవన్మరణం

అంత్యక్రియలకు ససేమిరా

ఆడపడుచులపై పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు

వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. తీసిచ్చిన అప్పు చెల్లించకపోవడంతో వి.కోటలో ఓ వివా హితుడు, మనస్పర్థలతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో మరో వ్యక్తి బలవన్మరణం చెందారు.

చిత్తూరు, వి.కోట: వ్యక్తిగత అవసరాల నిమిత్తం తాను బావమరిదికి అప్పు తీసిస్తే తిరిగి చెల్లించకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో అవమానభారంగా ఎంచిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని దాసార్లపల్లెకు చెందిన వెంకటరమణ  తన పెద్ద అక్క కుమారురుడికి అవసరాల నిమిత్తం వేరొకరి వద్ద  అప్పు తీసిచ్చాడు. ఈ నేపథ్యంలో అప్పు చెల్లించాలని రుణదాతల  వెంకటరమణను పదేపదే అడుగుతుండటం..బావమరిది తిరిగి చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురైన వెంకటరమణ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తన భర్త మరణానికి అతని  అక్కచెల్లెళ్లే కారణమని, అప్పు తీర్చేంతవరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతురాలి భార్య సరిత తేల్చిచెప్పింది. తన భర్త మృతదేహాన్ని అలాగే ఫ్రీజర్‌లో ఉంచారు. దీంతో గ్రామస్తులు వెంకటరమణ అక్కచెల్లెళ్లకు సమాచారమిచ్చారు. అయితే రెండు రోజులైనా వారు రాకపోవడంతో మంగళవారం  వెంకటరమణ భార్య తన ఆడపడుచులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసి వెంకటరమణ మృతదేహాన్ని  పోస్టుమాçర్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ  వైద్యశాలకు తరలించినట్లు సీఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఉరేసుకుని వివాహితుడు ఆత్మహత్య
శ్రీకాళహస్తి రూరల్‌: ఓ యువకుడు బలవన్మరణం చెందిన సంఘటన మంగళవారం శ్రీకాళహస్తి మండలంలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్‌ పోలీసుల కథనం..  మండలంలోని రాచగున్నేరి పంచాయతీ చటర్జీనగర్‌లో రేణిగుంటకు చెందిన నారాయణప్వామి(35), ధనలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. మనస్పర్థలతో ఇటీవల ధనలక్ష్మి తన పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ పెద్దలు మధ్యస్థం చేసి సర్దుబాటు చేశారు. ఆ తర్వాత కొన్నిరోజుల పాటు సజావుగా వీరి కాపురం సాగిననూ మళ్లీ దంపతుల నడుమ విభేదాలు తలెత్తాయి. రెండు రోజుల కిందట ధనలక్ష్మి తన ఇద్దరి పిల్లలను తీసుకుని మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన నారాయణస్వామి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు