రైతు సాధికారత సదస్సుకు చంద్రబాబు!

11 Dec, 2014 02:50 IST|Sakshi
రైతు సాధికారత సదస్సుకు చంద్రబాబు!

విజయవాడ : జిల్లాలో జరగనున్న రైతు సాధికారత సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సాగునీటి పారుదల, జలవనరుల నిర్వహణ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులతో మాట్లాడుతూ 16వ తేదీలోపు ఒకరోజు జిల్లాలో జరిగే సాధికారత సదస్సుకు ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆయన పర్యటన తేదీ త్వరలో ఖరారు అవుతుందని మంత్రి ఉమా వివరించారు. అధికారులు అప్రమత్తతతో సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు