వచ్చారు.. వెళ్లారు !

20 Nov, 2013 03:14 IST|Sakshi

అచ్చంపేట, న్యూస్‌లైన్: ఇటీవల కురిసిన భారీవర్షాలకు రైతన్న రెక్కల కష్టమంతా వర్షార్పణమైంది. 26 రోజుల తరువాత కేంద్ర కరు వు బృందం తీరిగ్గా కదిలింది. వచ్చిన అధికారులైనా పంట నష్టాన్ని పరిశీలించా? అంటే అదీ లేదు. చుట్టపుచూపుగా సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో చీకటిపడ్డాక జిల్లాలోకి అడుగుపెట్టారు. మంగళవారం సాయంత్రం కరువు బృందం సభ్యులు వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిన ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించారు.

  కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ అండర్ సెకట్రరీ కె.రామవర్మ, కేంద్ర ప్రణాళిక సంఘం పరి శోధనాధికారి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ తదితరులు నల్గొండ జిల్లా నుంచి నేరుగా జిల్లాలోని అచ్చంపేట మండలం మర్లపాడుతండా, కేశ్యతండా, సిద్ధాపూర్‌ను సందర్శించారు. అంతకుముందు మన్నెవారిపల్లి వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర బృందానికి స్వాగతం పలికారు.
 
 అనంతరం చీకట్లో వారికి ఏమీ కనిపిం చకపోయినా మర్లపాడుతండా కానుగుల చెరువు అలుగు పారి వరద తాకిడికి దెబ్బతి న్న పంటపొలాలను బృందం సభ్యు లు పరిశీలించారు. కానుగుల చెరువు కింద ఎన్ని ఎకరాలు ఉంది.. ఎంత న ష్టం జరిగిందని రైతులు జబ్బు పెద్దజంగయ్య, జక్కుల ముత్తయ్య, సా యులు లింగయ్య, తావుర్యలతో మా ట్లాడారు. నాలుగెకరాల్లో పత్తిపంట వే యగా వర్షాలకు పూర్తిగా ఇసుక మే ట లు వేసిందని, భవిష్యత్తులో పంట ప డించుకునే అవకాశమే లేదని తమ కు ఆర్థికసహాయం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు విన్నవించారు. మరోరైతు తావుర్య తాను ఎనిమిది ఎ కరాల్లో వరిపంట వేయగా ఇసుక మే టలు కప్పివేయడంతో పాటు రాళ్లు తే లాయని, లక్షలు ఖర్చుచేసినా భూమి సాగులోకి వచ్చే అవకాశమే లేదని వా పోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజప్తి చేశారు.
 
 అనంతరం ఇక్కడి నుంచి సిద్దాపూర్‌కు చేరుకున్న బృందం సభ్యులకు మాజీ సర్పంచ్ రాములు నాయక్ గ్రామానికి వచ్చే ర హదారితో పాటు రోడ్డు వెంటన ఉన్న వంతెనలు దెబ్బతిన్నాయని, తెగిన పాత చెరువు, పద్మరంతండా రోడ్డు, వరదలో కొట్టుకుపోయిన తాగునీటి పైపులైన్, జరిగిన పంటనష్టం వివరిం చారు. అచ్చంపేట ప్రాంతానికి మధ్యాహ్నం 2.30గంటలకు రావాల్సిన బృం దం రాత్రికి రావడం వల్ల వారు ఇసుక మేటలు వేసిన పొలాలు, దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ లైన్లు, తెగిన చెరువుల ను పరిశీలించే అవకాశం లేకుండా పో యింది. ఎంతోకొంత న్యాయం జరుగుతుందని ఆశించిన బాధిత రైతులకు నిరాశే మిగిలింది.
 
 రేపు మరోసారి ఇ క్కడికే వస్తామని చెప్పిన అధికారుల మాటపై నమ్మకం కలగడం లేదని రా త్రివేళ అయినా చూడాలని ఈప్రాంత రైతులు, ప్రజాప్రతినిధులు పట్టుపట్టి చూపించారు.  జేసీ శర్మన్‌తో పాటు నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, వనపర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పి.రాములు, జిల్లా టీడీపీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్ కేంద్ర కరువు బృందానికి పంట నష్టాన్ని వివరించారు. కేంద్ర బృందం వెంట జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు రఫీక్ అహ్మద్, ఏడీఏ సరళకుమారి, తహశీల్దార్ జ్యోతి, ఆర్‌అండ్‌బీ డీఈ చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి, టీడీపీ నేత పి.మనోహర్, టీఆర్‌ఎస్ నాయకులు గువ్వల బాల్‌రాజ్ తదితరులు ఉన్నారు.
 
 ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన కేంద్ర బృందం
 నాగర్‌కర్నూల్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఆయా ప్రాంతాల్లో మంగళవారం పర్యటించిన కేంద్ర పరిశీలన బృందం రాత్రి నాగర్‌కర్నూల్ పీఆర్ అతిథిగృహానికి చేరుకుంది. ఈసందర్భంగా పంటనష్టానికి సంబంధించిన ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలన బృందం సభ్యులు  పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ గిరిజాశంకర్ ప్రొజెక్టర్ ద్వారా జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి నివేదించారు. వర్షం ద్వారా కలిగిన ప్రాణనష్టం, పంటనష్టం, ఆర్‌అండ్‌బీ రోడ్లు, కల్వర్టులు, కూలిపోయిన ఇళ్లు, చనిపోయిన పశుసంపద గురించి బృందానికి వివరించారు.  
 

మరిన్ని వార్తలు