చంద్రబాబు ఇచ్చే ఏసీ రూమ్స్ అవసరం లేదు!

17 Nov, 2014 18:47 IST|Sakshi

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భూసేకరణపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు చంద్రబాబు ఏసీ రూమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. భూములను యథావిధిగా ఉంచితే తామే ఏసీ రూమ్స్ ను ఏర్పరచుకోగలమని వారు స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలోని లింగాయపాలెంలో వైఎస్సార్ సీపీ రైతు, కూలీ హక్కుల పరిరక్షణ కమిటీ పర్యటనలో రైతులు తీవ్రంగా స్పందించారు.

 

సెంటు భూము లేని కౌలు రైతులు ఎంతో కష్టపడి 10 ఎకరాలు సంపాదింఇచన విజయగాథలు తుళ్లురు మండలంలో ఉన్నాయన్నారు. 'చంద్రబాబు ఏసీ రూమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు ఏసీ గదుల్లో పడుకునే శక్తి ఉంది' అని వారు పేర్కొన్నారు. ఆ స్థాయిలో ఆదాయ వనరులు తెచ్చుకునే శక్తి ఇక్కడి రైతులకు ఉందని రైతులు కరాఖండిగా తేల్చిచెప్పారు. సింగపూర్ మనకు అవసరమా?కిలో కూరగాయలు కొనుక్కునే శక్తి మనకు అవసరమా?రైతులు ప్రశ్నించారు.

 

ఇక్కడ భూములను పాడు చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని.. ఇక్కడ రాజధాని కడితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూరగాయల ధరల పెరుగుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ ను నియంత్రించే శక్తి ఇక్కడ రైతులకు ఉందని.. ఇంత సస్య శ్యామలంగా ఉండే భూములను ఎందుకు ఎంచుకున్నారో తమకు తెలియడం లేదన్నారు. రాజధాని భూసేకరణ ప్రాంతాల్లో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని రైతులు ఎద్దేవా చేశారు. సంపద సృష్టించే శక్తి ఉన్న రైతులు ఇక్కడ ఉన్నారని.. నదికి ఆనుకుని ఉన్న భూములను వదిలేయాలని కోరుతున్నామన్నారు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధోరణి ఉందన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క చినుకుకూడా పడలేదని..ఆ సమయంలో కరవు రాజ్యాన్ని ఏలిందన్న సంగతిని రైతులు గుర్తు చేసుకున్నారు. చిన్న రైతులను నష్టపరిచే ప్రతిపాదనలను ప్రభుత్వం తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు