బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి  అ‘రాజ’క పాలన ఇంకెన్నాళ్లు..

13 Mar, 2019 10:59 IST|Sakshi
సిద్ధాపురం చెరువు ఎత్తిపోతల డెలివరీ పాయింట్‌

సాక్షి, ఆత్మకూరు రూరల్‌: ఎన్నికలు మళ్లీ వచ్చాయి.. మైకుల రొదలు మొదలయ్యాయి.. అవి చేస్తాం..ఇవి చేస్తాం..అడిగినవన్నీ చేస్తాం.. ఎన్నెన్నో హామీలు..అంతటా వాగ్దానాలు గతాన్ని పరికిస్తే..పాలనను విశ్లేషిస్తే.. శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి  అ‘రాజ’క పాలన కళ్ల ముందు కదలాడుతుంది. నీళ్లివ్వకుండా ఆయన చేసిన దాష్టీకం మరవబోమని రైతులోకం మండిపడుతోంది. 
సిద్ధాపురం..జిల్లాలోనే అతిపెద్ద చెరువు.

వర్షాలు పడక నిండేది కాదు. ఎత్తిపోతలతో దీనికి జీవ కల తీసుకురావాలన్నది రైతుల ఆకాంక్ష. ఎందరో ముఖ్యమంత్రులు చేతులెత్తేయగా..దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూనికతో ఈ ప్రాజెక్ట్‌  సాకరమైంది. వైఎస్సార్‌ పాలనలో 80 శాతం పనులు పూర్తికాగా..మిగిలిన 20 శాతం టీడీపీ ప్రభుత్వ పూర్తి చేయలేకపోయింది. కాల్వలు, ప్రధాన రహదారుల కల్వర్టులు పూర్తి కాకుండానే గతేడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రారంభోత్సవం చేశారు.

ఆయకట్టు రైతులకు 2018లో రబీకి నీరందిస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయకట్టులోని అన్ని గ్రామాల నుంచి సాగు నీటి కోసం డిమాండ్‌ పెరగడంతో బుడ్డా..తమ రాజకీయాలకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. అందరికీ నీరందించేందుకు శ్రమిస్తున్నట్లు డ్రామాలాడారు. అయితే నీరు లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కాల్వలపై తిరుగుతూ రైతులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే పెద్దనంతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు, సిద్ధపల్లెకు చెందిన మరో రైతుపై టీడీపీ నాయకులు భౌతిక దాడులకు దిగారు.   

ఇదీ వైఫల్యం.. 
శ్రీశైలంలో 200 టీఎంసీలు, వెలుగోడు బ్యాలెన్సింగ్‌  రిజర్వాయర్‌లో 16 టీఎంసీల నీరున్నపుడు ఖరీఫ్‌కు అనుమతి లేదంటూ అధికారులు ఎత్తిపోతల మోటార్లను ఆన్‌ చేయలేదు. ఆన్‌ చేయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించనూ లేదు. అరకొర నీటికోసం ఆయకట్టు గ్రామాల నడుమ జలయుద్ధాలు మొదలయ్యాయి. టీడీపీ నాయకులు మాత్రం చేయాల్సింది చేయకుండా కాల్వల వెంట పచార్లు చేస్తూ రైతులపై దాడులు చేస్తూ వచ్చారు.  

 సిద్ధాపురం..జిల్లాలోనే అతిపెద్ద చెరువు. వర్షాలు పడక నిండేది కాదు. ఎత్తిపోతలతో దీనికి జీవ కల తీసుకురావాలన్నది రైతుల ఆకాంక్ష. ఎందరో ముఖ్యమంత్రులు చేతులెత్తేయగా..దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూనికతో ఈ ప్రాజెక్ట్‌  సాకరమైంది. వైఎస్సార్‌ పాలనలో 80 శాతం పనులు పూర్తికాగా..మిగిలిన 20 శాతం టీడీపీ ప్రభుత్వ పూర్తి చేయలేకపోయింది. కాల్వలు, ప్రధాన రహదారుల కల్వర్టులు పూర్తి కాకుండానే గతేడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రారంభోత్సవం చేశారు.

ఆయకట్టు రైతులకు 2018లో రబీకి నీరందిస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయకట్టులోని అన్ని గ్రామాల నుంచి సాగు నీటి కోసం డిమాండ్‌ పెరగడంతో బుడ్డా..తమ రాజకీయాలకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. అందరికీ నీరందించేందుకు శ్రమిస్తున్నట్లు డ్రామాలాడారు. అయితే నీరు లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కాల్వలపై తిరుగుతూ రైతులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే పెద్దనంతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు, సిద్ధపల్లెకు చెందిన మరో రైతుపై టీడీపీ నాయకులు భౌతిక దాడులకు దిగారు.   
 
నీటి కోసం పోరాటం చేశాం 
సిద్ధాపురం చెరువుకు నీళ్లు వస్తున్నాయి..ఇక కరువు ఉండదనుకున్నాం. చెరువుకు నీరు తీసుకురావడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారు. ఉన్న నీటికోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది. చివరకు పైర్లు ఎండే పోయాయి. 
–ద్రోణారెడ్డి , రైతు, నల్లకాల్వ 

పంట కాల్వలు పూర్తి చేయండి  
పనులు పూర్తి కాకుండానే ప్రారంభించేసి తెలుగు దేశం నాయకులు లబ్ధి పొందాలనుకున్నారు. ప్రధాన కాల్వలే ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పంటకాల్వల సంగతి అతీ గతీ లేదు.   
–లక్ష్మన్న, రైతు, కరివేన 

మరిన్ని వార్తలు