రైతులను ముంచిన అకాల వర్షం

3 Mar, 2014 02:47 IST|Sakshi
  •     మిర్చి పంటలకు భారీ నష్టం
  •      నేలకొరిగిన మొక్కజొన్న
  •  నర్సంపేట/దుగ్గొండి, న్యూస్‌లైన్ : పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతుల ను శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం నష్టాల పాలు చేసింది. చేతికి వచ్చిన మిర్చి కల్లాలపైనే తడిసి ముద్దయిం ది. ఏపుగా పెరిగిన మొక్కజొన్న నేలవాలింది. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సం పేట వుండలాల్లో మిర్చి పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. నర్సంపేట మండలం కవ్ముపల్లి, దాసరిపల్లి, చంద్రయ్యుప ల్లి, దుగ్గొండి మండలం తిమ్మంపేట, మహ్మదాపురం, మర్రి పల్లి గ్రామాలలో పెద్ద ఎత్తున దేశి రకం(టవూట) మిర్చి పంటను సాగుచేశారు. కొన్ని గ్రామాల్లో పంటను తెంపి నాగపూర్‌కు తరలేందుకు కల్లాలపై ఆరబోశారు.

    మరికొన్ని గ్రామాల్లో పంట ఇంకా తోటలోనే ఉంది. వర్షం కారణంగా మిరప పండు తడిసి నల్లబారి బూజుపట్టే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటల్లో ఉన్న కాయల తొడిమిల గుండా నీరు లోనికి చేరి కాయ మురిగి రాలిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. మహ్మదాపురంలో పాలడుగుల రాజన్నకు చెందిన 20 క్వింటాళ్లు, గెడ్డ కృష్ణంరాజుకు చెందిన 20 క్వింటాళ్ల మిర్చి తడిసిపోయింది. వీరితోపాటు మరో 30 మంది రైతుల పంట కల్లాలపైనే ఉండి పోయింది.

    వెంకటాపురంలో నల్ల రాజిరెడ్డికి చెందిన మూడు కల్లాలలోని మిర్చి మురిగిపోయో స్థితికి వచ్చింది. నాచినపల్లిలో అండృ రాజు, శ్రీరామోజు ప్రభాకర్ పంటల పరిస్థితీ అలానే ఉంది. కాసు కుమారస్వామి, కంచరకుంట్లు నర్సింహారెడ్డి, సమ్మిరెడ్డి, గుడిపెల్లి రాంరెడ్డి, నాతి వెంకటేశ్వర్లుకు చెందిన మొక్కజొన్న పంటంతా నేలవాలింది. కంకులు వేసే దశలో కర్రలు కుప్పకూలడంతో పంటలకు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఆదివారం రాత్రి కూడా భారీగా వర్షం కురిసింది. దీంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు