గుమ్మడి గెడ్డపై రిజర్వాయరు నిర్మించాలన్నా...

21 Nov, 2018 07:44 IST|Sakshi
గుమ్మడిగెడ్డపై రిజర్వాయరు కట్టాలని జగన్‌ను కోరిన రైతులు

ఏటా పంట పొలాలు మునిగిపోతున్నాయి... దళాయిపేట గ్రామానికి ఓ వైపు నాగావళి, మరోవైపు గుమ్మడిగెడ్డ ఉన్నాయి. నీరు ఎక్కువగా వస్తే మా పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. గ్రామానికి ఆనుకొని కరకట్ట పనులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో గ్రామంలోకి నీరు వచ్చేస్తోంది. నాగావళికి ఆనుకొని 50 ఎకరాలు, గుమ్మడిగెడ్డకు ఆనుకొని వంద ఎకరాల్లో ఏటా వరి, జొన్న సాగు చేస్తుంటాం. ఏటా జూలై నుంచి అక్టోబరు వరకు మా పంట పొలాలు ముంపునకు గురై పొలాల్లో ఇసుక మేటలు వేస్తోంది. ఇది ఆర్థిక సమస్యగా మారింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్ట పరిహారం అందడం లేదు. మీరు అధికారంలోకి రాగానే పరిశీలించి ఆదుకోవాలి.        –గొంగాడ రాము, దళాయిపేట

గుమ్మడి గెడ్డపై రిజర్వాయరు నిర్మించాలన్నా...
గుమ్మడిగెడ్డపై రిజర్వాయరు నిర్మించి ఆదుకోవాలి. గుమ్మడిగెడ్డ నీటిని వట్టిగెడ్డకు మళ్లించడంతో ఇబ్బందులకు గురవుతున్నాం. గుమ్మడి గెడ్డపై రిజర్వాయరు ఏర్పాటు చేయాలి. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడ రిజర్వాయరు కడితే ప ది వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మీరు అధికారంలోకి రాగానే రిజర్వాయరు కట్టి ఆదుకోవాలి.–పలు మండలాల రైతులు

మరిన్ని వార్తలు