'రాజధానికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేం'

6 Dec, 2014 16:15 IST|Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానికి తాము వ్యతిరేకం కాదంటూనే ఏడాదికి మూడు పంటలు పండే భూములను ఇవ్వలేమని తుళ్లురు రైతులు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. శనివారం కేఎల్రావు భవన్లో తుళ్లూరు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా పలువురు రైతు సంఘం నేతలు, రాజకీయ నేతలు హాజరయ్యారు.

రాజధానికి తాము వ్యతిరేకం కాదన్న రైతులు ..  పంట భూములను ఇస్తే వచ్చే నష్ట పరిహారం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. రాజధాని భూ సమీకరణకు సంబంధించి పరిహార ప్యాకేజీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసినా తుళ్లురు రైతులు అందుకు ఆసక్తి కనబరచడం లేదు.

మరిన్ని వార్తలు