బసవన్నా..పని నేర్చుకోవాలన్నా..

30 Jun, 2019 13:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సేద్యంలోకి వస్తున్న యువ బసవన్నలవి. కాస్తంత పౌరుషం, మరికాస్త రంకెతనం పాళ్లు ఎక్కువగా ఉండే తత్వం వాటిది.  నయానో, భయానో రైతే వాటిని మచ్చిక చేసుకుని పొలంబాట పట్టించాలి.  ఇంటి దగ్గర మెడకు కాడి తగిలిస్తే.. నేరుగా తమ పొలం దగ్గరకు యజమాని చండ్రాకోలు పట్టుకుని వెనుక లేకపోయినా వెళ్లేంతగా తర్ఫీదునివ్వాలి. అలా వాటిని తయారు చేసే పనిలో భాగంగా..  పొలాన్ని ఎంత వేగంతో నాగలిని పట్టిలాగాలో  సచివాలయం నుంచి ఉండవల్లి వెళ్లే మార్గంలో ఇరువురు రైతులు స్వయంగా నేర్పిస్తున్నారు. కాడికి రెండు ఎద్దులను కట్టి దానికి ఓతాడు సాయంతో టైరు అనుసంధానం చేసుకుని అరక దున్నే విధానాన్ని నేర్పిస్తున్న దృశ్యం శనివారం ఉదయం సాక్షి కెమెరాకు చిక్కింది. 
 

మరిన్ని వార్తలు