అయ్యో దేవుడా..!

12 Jan, 2014 03:54 IST|Sakshi

 గోదావరిఖని/కమాన్‌పూర్, న్యూస్‌లైన్ : కమాన్‌పూర్ మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ కుందారపు శ్రీనివాస్(38), భార్య శ్రీలత, కుమార్తె దీక్షిత(9), కుమారుడు అజయ్‌రామ్‌తో కలిసి అదిలాబాద్ జిల్లా మందమర్రిలో తోడల్లుడి బంధువుల ఇంట్లో దశదినకర్మ కార్యక్రమానికి గురువారం ఉదయం తన ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ కార్యక్రమం పూర్తికాగానే తిరిగి అదే రాత్రి 7గంటలకు ఈ న లుగురు రొంపికుంటకు బయలుదేరారు. మం దమర్రి సమీపంలోని పాలవాగు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా రహదారిపై పాము అడ్డం వచ్చింది.

దీంతో ఆందోళనకు గురై దానిని త ప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పిం ది. ఈ క్రమంలో బ్రిడ్జికి ఇవతల వైపున్న సిమెం ట్ దిమ్మెలకు ఢీకొన్న వాహనం వేగంగా బ్రిడ్జి కిందకు దూసుకుపోయింది. వాహనంపై ఉన్న నలుగురు చెల్లాచెదురుగా పడిపోయారు. శ్రీని వాస్‌కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ముందు భాగంలో కూర్చున్న కుమార్తె దీక్షిత(9)కూడా తీవ్ర గాయాలపాలైంది. కొంతసేపటి వరకు నీళ్లు కావాలని ఏడ్చింది. ప్రమాదంలో నడు ము, ఒక కాలు విరిగిపోయి పడిపోయిన తల్లి శ్రీలత కదలలేని స్థితికి చేరింది. కుమారుడు అ జయ్‌రామ్‌కు కూడా గాయాలైనప్పటికీ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తున్నాడు. సోదరి నీళ్ల కోసం ఏడుస్తుండగా తట్టుకోలేక ఆ ఇసుకలో అటు ఇటు తిరిగినా నీళ్లు దొరకలేదు. ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడ్చిఏడ్చి ఆ రాత్రే కన్నుమూసింది.

 ఓవైపు భర్త, కుమార్తె కళ్లముందే దుర్మరణం పాలుకాగా, తీవ్ర గాయాలపాలైన కుమారుడిని చూస్తూ ఆ తల్లి ఏమీ చేయలేక.. బయటకు గొంతుపెగలక లోలోపలే ఏడ్చింది. చివరకు గాయాలపాలైన అజయ్ పాకుతూ చుట్టూ కలియతిరగడంతో పడిపోయిన సెల్‌ఫోన్ కనిపించింది. వెంటనే మందమర్రిలో ఉంటున్న అమ్మమ్మకు ఫోన్ చేసి ‘మాకు యాక్సిడెంట్ అయ్యింది. మేం బ్రిడ్జి కింద ఉన్నాం..’ అంటూ ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే ఆమె తరుపు బంధువులందరికీ ఈ విషయాన్ని చెప్పడంతో.. వారు శుక్రవారం గోదావరిఖనిలోని బ్రిడ్జి మొదలుకొని మందమర్రి వరకు గల బ్రిడ్జీలన్నింటిని తిరిగారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. చివరకు మంచిర్యాల పోలీసులను ఆశ్రయించారు. ప్రతీ బ్రిడ్జి వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న ఫోన్ రింగ్ ఇవ్వడంతో మందమర్రి సమీపంలోని పాలవాగు వద్ద శనివారం సాయంత్రం క్షతగాత్రులు కనిపించారు. వెంటనే గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఒక వేళ సెల్‌ఫోన్ చెడిపోయినా.. ఆ రాత్రి ఏవైనా విషపురుగులు బతికున్న వారిని కాటేసినా ఆ కుటుంబంలో ఒక్కరూ మిగిలేవారు కాదు. ప్రమాదం జరిగిన గురువారం రాత్రి 7గంటల నుంచి.. శనివారం సాయంత్రం వరకు దాదాపు రెండు రోజులపాటు మతదేహాల పక్కనే తల్లి, కుమారుడు ఉండిపోయారు. శ్రీనివాస్ 15 ఏళ్ల నుంచి రొంపికుంట గ్రామంలో వైద్య సేవలందిస్తూ అందరితో కలివిడిగా ఉండేవాడు. గతంలో గ్రామంలో పాఠశాలను నిర్వహించగా.. దానిని ఇతరులకు అప్పగించాడు. పిల్లలు అజయ్‌రామ్ 5వ తరగతి, దీక్షిత 4వ తరగతి యైటింక్లయిన్‌కాలనీలోని కష్ణవేణి పాఠశాలలో చదువుతున్నారు. శ్రీనివాస్, దీక్షిత మతి చెందడం, శ్రీలత, అజయ్ తీవ్ర గాయాలపాలయ్యాయి.

మరిన్ని వార్తలు