మట్టిని నమ్ముకుని.. మట్టిలోనే కలిసిపోయారు!

8 Aug, 2019 08:06 IST|Sakshi
పొలంలో గుండెపోటుతో మృతి చెందిన తండ్రి త్రినాథ, విద్యుత్‌ షాక్‌తో మూడు నెలల క్రితం మృతి చెందిన శ్రీనివాసరావు(ఫైల్‌ ఫొటో)

మూడు నెలల వ్యవధిలో తండ్రీ, కొడుకుల మృతి

కంబరవలసలో విషాదఛాయలు

సాక్షి, వీరఘట్టం (శ్రీకాకుళం): తమ్ముడి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించేందుకు, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు వలస వెళ్లి వచ్చిన ఆ ఇంటి పెద్ద కొడుకును మూడు నెలల క్రిందట సొంత పొలంలో విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు కాటేసింది. ఆ విషాదం మరువక ముందే ఆ ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి త్రినాథ(71) పొలంలో పని చేస్తూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వీరఘట్టం మండలం కంబరవలసలో విషాదం నింపింది.

మూడు నెలల కిందట కొడుకు...
వీరఘట్టం మండలం నడుకూరు పంచాయతీ కంబరవలస గ్రామానికి చెందిన గొడబ శ్రీనువాసరావు (40) తండ్రితో కలిసి ఈ ఏడాది మే 4న అరటితోటకు నీరు కట్టేందుకు పొలానికి వెళ్లాడు. విద్యుత్‌ స్తంభానికి బిగించిన ప్యానల్‌ బోర్డు వద్ద స్విచ్‌ ఆన్‌ చేసి మోటారు వేశాడు. నీటిని పొలంలోకి మళ్లించేందుకు గట్టుకి ఆనుకొని ఉన్న విద్యుత్‌ స్తంభం స్టేవైర్‌ (సపోర్టింగ్‌ వైర్‌)ను పట్టుకొని గట్టు దిగేందుకు ప్రయత్నించాడు. అప్పటికే వైర్‌ గుండా విద్యుత్‌ ప్రవాహం జరుగుతుండగా శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు.

గుండె పోటుతో తండ్రి..
కొడుకును పోగొట్టుకున్న తండ్రి పొలం పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఖరీఫ్‌ పనులు జరుగుతుండడంతో మంగళవారం దమ్ములు చేస్తుండగా గుండెపోటు రావడంతో పొలంలోనే కుప్పకూలిపోయి మృతి చెందాడు. తండ్రీకొడుకులిద్దరూ పొలంలోనే మృత్యువాతపడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. త్రినాథ మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు జరిపించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వంశధార, నాగావళికి వరదనీటి ఉధృతి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు 

క్విట్‌ కోడెల.. సేవ్‌ సత్తెనపల్లి

జూడాల ఆందోళన ఉద్రిక్తం

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు

రేపే భారీ పెట్టుబడుల సదస్సు

వదలని వరద

మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌

రాష్ట్రానికి అండగా నిలవండి

ఆశావర్కర్లకు జీతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన పొడిగింపు

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌

చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయింది

ఢిల్లీకి పయనమైన ఏపీ గవర్నర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

'ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేయాలి'

ఉద్యోగ భద్రతపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి

ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు వరద కష్టాలు

'చిన్న గొడవకే హత్య చేశాడు'

కోడెల పంచాయతీ.. ‘డోంట్‌ వర్రీ’ అన్న బాబు!

రాజకీయ జోక్యం, లాబీయింగులు ఉండవు : మంత్రి

ముగిసిన కేంద్ర ఆర్థిక మంత్రి-సీఎం జగన్‌ భేటీ

కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం‍ అవాస్తవం

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

రైతుల అభ్యున్నతికి పాటు పడాలి: జోగి రమేశ్‌

వరద నీటిలో దహన సంస్కారాలు

సీఎస్‌​ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మంత్రి అవంతి సమీక్ష

నాగావళి-వంశాధారకు పెరుగుతున్న వరద ఉధృతి

ఏపీలో శ్రీదేవి డిజిటల్‌ సేవలు ప్రారంభం

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!