కూతురిని గర్భవతిని చేసిన తండ్రి

7 Jul, 2019 19:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలో ఘోరం జరిగిపోయింది. వావి వరుసలు మరిచి కన్నతండ్రే తన సొంత కూతురి(12)పై అత్యాచారం చేసిన దారుణ సంఘటన బుట్టాయిగూడెంలో వెలుగు చూసింది. గత కొంతకాలంగా తండ్రి చేసిన ఈ దుర్మార్గం వల్ల ఆ మైనర్‌ బాలిక గర్భవతి అయింది. ఈ విషయం తల్లికి చెబితే చంపుతానంటూ ఆ బాలికను బెదిరించాడు. కానీ, ఎలాగోలా తెలుసుకున్న ఆబాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కాకినాడకి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా