ఆ సమాచారం ఎవరిచ్చారో చెప్పండి

14 Dec, 2017 01:54 IST|Sakshi

 ‘మర్యాదగా కోచింగ్‌లో చేరండి’ వార్తపై సీఎం పేషీ ఫైర్‌

ఫాతిమా విద్యార్థులకు మళ్లీ సీఎం పేషీ బెదిరింపు కాల్స్‌

సాక్షి, అమరావతి: ‘మీడియాకు ఎవరు సమాచారమిచ్చారో చెప్పాలి. లేదంటే మాదగ్గర ఇంటెలిజెన్స్‌ అధికారులున్నారు. వారి ద్వారా ఎవరు సమాచారమిచ్చారో తెలుసుకోగలం’అని ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఫాతిమా విద్యార్థులను మళ్లీ బెదిరించారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘మర్యాదగా కోచింగ్‌లో చేరండి’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై సీఎం పేషీ అధికారులు ఫాతిమా విద్యార్థులపై భగ్గుమంటున్నారు. కోచింగ్‌లో చేరండి అంటే మీరు మీడియాకు ఎందుకు సమాచారమిచ్చారంటూ పలువురు అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరించారు.

సీఎం పేషీలో ఉన్నతాధికారి గిరిజాశంకర్‌ వ్యక్తిగత కార్యదర్శి సత్యనారాయణ నుంచి ఫోన్లు వచ్చాయని, ఎవరు సమాచారం ఇచ్చారో చెప్పాలని, లేదంటే మీ నెంబర్లన్నీ మా ఇంటెలిజెన్స్‌ అధికారుల ద్వారా విచారించి తెలుసుకోగలమని హెచ్చరించినట్లు బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఫాతిమా విద్యార్థులతో మాట్లాడేందుకు సీఎం పేషీ ఉన్నతాధికారి గిరిజాశంకర్‌ బుధవారం అపాయిం ట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ సాక్షిలో వార్త ప్రచురితమయ్యాక తాను ఫాతిమా విద్యార్థులతో మాట్లాడేది లేదని తెగేసి చెప్పినట్టు విద్యార్థులు తెలిపారు.

మరిన్ని వార్తలు