నీట్‌ కోచింగ్‌ అనడం అన్యాయం

8 Dec, 2017 11:13 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌కు ఫాతిమా విద్యార్థుల మొర

విజయవాడ: కడపలోని ఫాతిమా మెడికల్‌ కళాశాల విద్యార్థులు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. తమ సమస్యపై రెండున్నర సంవత్సరాలుగా పోరాడుతున్నామని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తమకు వేరే కాలేజీలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారని, ఆ తర్వాత తమను పట్టించుకోలేదని వాపోయారు. ఇలాంటి పరిస్థితి కేరళలో ఎదురైతే అక్కడి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా న్యాయం చేసిందని వివరించారు. ఇక్కడ మాత్రం సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి కామినేనిలు నీట్‌ కోసం కోచింగ్‌ ఇప్పిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని, యాజమాన్యం చేసిన తప్పుకు తాము బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను రీలొకేట్‌ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంసీఏను కోరాలని, లేదా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కోరారు. కనీసం ‘సి’ కేటగిరీలో కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేది లేదని మేనేజ్‌మెంట్‌ చెబుతోందని విద్యార్థులు పవన్‌కల్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. 

>
మరిన్ని వార్తలు