‘ఆదర్శం’వైపు అడుగులు

8 Feb, 2015 03:53 IST|Sakshi

సంసద్ ఆదర్శ యోజన పథకం కింద ఎంపికైన ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామం ఆదర్శం వైపు అడుగులు వేస్తోంది. ఈ గ్రామాన్ని ప్రధానంగా పట్టి పీడిస్తున్న మద్యం మహమ్మారిని పారద్రోలే పనిలో పడ్డారు. ఇప్పటికే సారా తయారీకి స్వస్తి చెప్పిన గ్రామస్తులు, ఊర్లో ఉన్న రెండు బెల్టు దుకాణాలనూ మూసేశారు.
 
 ప్రభుత్వ నిధులు విడుదల చేసినంత మాత్రానే అభివృద్ధి సాధ్యం కాదని, చేయీ చేయీ కలిపితేనే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలమనే భావనకు వచ్చి పారిశుధ్యం, అక్షరాస్యత, మద్యనిషేధం, తాగునీటి వసతి కార్యక్రమాల అమలుకోసం ఏకమై ముందుకు సాగుతున్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి స్ఫూర్తిగా ఎనిమిది కమిటీలుగా ఏర్పడి ఆయా అంశాల అమలుకు కృషి చేస్తున్నారు. తన కోటా నిధులతో ఎంపీ బి.వినోద్‌కుమార్ పర్యవేక్షణ, కలెక్టర్ నీతూప్రసాద్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం కలిసి ఈ గ్రామ రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు.
 - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /ఎల్లారెడ్డిపేట

మరిన్ని వార్తలు