మాట ఇస్తే తప్పని నేత

5 Mar, 2019 16:26 IST|Sakshi
ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ముస్లిం మైనార్టీ నాయకులు

నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ 

సాక్షి, నెల్లూరు(సెంట్రల్‌): రాష్ట్రంలో ప్రజలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారంటే ఎన్ని కష్టాలు వచ్చినా తప్పని గొప్ప నాయకుడు అని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక 42వ డివిజన్‌కు చెందిన మైనార్టీ సోదరులు షేక్‌ సత్తార్‌తోపాటు మరో 150 మంది స్థానిక మెక్లిన్స్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్‌ సమక్షంలో  సోమవారం వైఎస్సార్‌సీపీలో  చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా నవరత్నాలు పథకాలు తీసుకొచ్చారన్నారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబునాయుడు  ప్రజల కష్టాలను  పట్టించుకోకుండా ఎన్నికల సమీస్తున్న నేపథ్యంలో మాయమాటలు చెప్పేదానికి మరొమారు సిద్ధమయ్యారన్నారు. ఇన్నేళ్లు మైనార్టీలను పట్టించుకోని చంద్రబాబు మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చి నాటకాలాడుతున్నారన్నారు.

ఇమామ్‌ మౌజ్‌లకు 14 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు మైనార్టీలపై ప్రేమ చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో బీసీకోటాలో అజీజ్‌ను మేయర్‌ను చేసినట్లు పేర్కొన్నారు. మేయర్‌ అయిన నెలరోజుల్లోపే 2019 ఎన్నికల్లో  ఎమ్మెలే టికిట్‌ ఇస్తానని చెప్పి అజీజ్‌ను టీడీపిలోకి ఆహ్వానించిన మంత్రి నారాయణ ప్రస్తుతం మొండి చేయి చూపించారన్నారు. నారాయణే నగర అభ్యర్థిగా బరిలో దిగుతూ ముస్లిం మైనార్టీలను మోసం చేశారని విమర్శించారు.

హౌస్‌ ఫర్‌ ఆల్‌ ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు మంచి చేసే అవకాశం కలుగుతుందన్నారు. షేక్‌ సర్దార్, జబ్బీర్, షాహుల్, ఆసిఫ్,  షేక్‌ షబ్బీర్, నాసిర, షేక్‌హసీనా, షేక్‌ గౌసియా పార్టీలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో ఇంతియాజ్,. ఖలీల్‌ అహ్మద్, హంజా ఉస్సేని, ఇస్మాయిల్, బాబా అబ్దుల్, ఎండీ తారిక్‌ అహ్మద్, మున్వర్, ఆలిం, మీరా మొహిద్దీన్, ఫజల్‌ అహ్మద్, శివపురం సురేష్, ఎస్‌కే హాజీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు