నియోజకవర్గంలో ఆధిపత్యపోరు

19 Nov, 2013 04:33 IST|Sakshi

 కామారెడ్డి, న్యూస్‌లైన్:
 కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మధ్య ఆధిపత్యపోరు రసవత్తరంగా మారింది. మూడునాలుగేళ్లుగా అభివృ ద్ధి పనులకు మంజూరయ్యే నిధుల విషయంలోనో, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగానో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఒక్కోసారి కాంట్రాక్టుల విషయంలోనూ ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి.
 
 పోటాపోటీగా
 ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు కీలకమైన మంత్రి పదవులు కూడా నిర్వహించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కామారెడ్డిలో షబ్బీర్‌అలీ అప్పటి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన గంప గోవర్ధన్ చేతిలో ఓటమి చెందారు. ఓడిపోయినా నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ డం ఆయనకు కలిసి వచ్చింది. అధికారులు ఆయన మాటను కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఎని మిది నెలల క్రితం షబ్బీర్‌అలీ ఎమ్మెల్సీ పదవితో ని యోజకవర్గంలో అడుగుపెట్టిన తరువాత అధికారిక కార్యక్రమాలలో తనదైన ముద్రవేసేందుకు అధికారులపై మరింత ఒత్తిడి పెంచారు. దీంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అప్రమత్తమై తన ఉనికికి ఎక్కడా ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అధికారులను డామినేట్ చేస్తూ నియోజకవర్గంలో ఏమి జరిగినా తనకు తెలియాల్సిం దేనని పట్టుబడుతున్నారు.
 
 నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనను కాదని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారంటూ శాసనసభ స్పీకర్‌కు, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కొంతకాలం పాటు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల విషయంలో ఇద్దరూ స్తబ్దుగానే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారుల చొరవతో ఇరువురూ తలా కొన్ని అభివృ ద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసుకునే అవకాశం ఏర్పడింది. అది ఎంతో కాలం నిలవలేదు. నియోజక వర్గానికి నిధులను తానంటే.. తానే మంజూరు చేయించామని ఇద్దరూ  చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే గా తాను ప్రతిపాదనలు పంపి, సంబంధిత అధికారు లు, మంత్రుల ద్వారా నిధుల మంజూరు తీసుకువచ్చానని ఎమ్మెల్యే చెప్పుకుంటే.. తాను పంపిన ప్రతిపాదనలకు నిధులు వచ్చాయని ఎమ్మెల్సీ పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పరంగా వచ్చే ఇతర నిధుల విషయంలోనూ ఇద్దరూ క్రెడిట్ కొట్టేందుకు పోటీ పడుతున్నారు. దీంతో ఇద్దరి  మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
 
  తెలంగాణ విషయంలోనూ ఇద్దరు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టుకుందని షబ్బీర్‌అలీ చెబుతుంటే, పదమూడేళ్లుగా టీఆర్‌ఎస్ పోరాటం,అమరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గోవర్ధన్ అంటున్నారు. తెలంగాణ కోసం షబ్బీర్ చేసిందేమీ లేదని గోవర్ధన్ విమర్శిస్తే, పదవి కోసమే టీఆర్‌ఎస్‌లో గోవర్ధన్ చేరారని షబ్బీర్ ఆరోపిస్తున్నారు. ఇరువురు ముఖ్య నేతల మధ్య రాజకీ య పోరును స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తా జాగా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామంలో పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే గోవర్ధన్ ప్రారంభిం చిన సందర్భంలో స్థానిక సర్పంచ్‌ను ఆహ్వానించలేదని  కాంగ్రెస్ నేతలు  ఆదివారం ధర్నాకు దిగారు. ప్రతిగా టీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేశారు. సోమవారం కాం గ్రెస్ పిలుపు మేరకు మాచారెడ్డిలో బంద్ జరిగింది.
 
 

మరిన్ని వార్తలు