శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్

29 Dec, 2014 03:39 IST|Sakshi
శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్

సాక్షి, తిరుమల : సినీ నటుడు శ్రీకాంత్, ఊహ తమ కుమార్తె, కుమారులతో కలిసి ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు ఆలయానికి వచ్చారు. శ్రీవారు, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వారికి అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హుదూద్ బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచిందని తెలిపారు. తాను నటించిన ఢీ అంటే ఢీ జనవరిలో విడుదల కానుందని చెప్పారు. నాటు కోడి, జల్సారాయుడు సెట్‌లో ఉన్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలిపారు.

మరిన్ని వార్తలు