సినీ నటి అరెస్టు

26 Apr, 2015 09:04 IST|Sakshi

కర్నూలు : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తప్పించుకు తిరుగుతున్న సినీ నటి నీతూ అగర్వాల్‌ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్‌వలీతో నీతూ అగర్వాల్ సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతూ అగర్వాల్ ఖాతాల నుంచి నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన సీసీఎస్ పోలీసులు ఆమెను కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రేపు కోర్టుకు హాజరు పరుస్తారని సమాచారం. కాగా అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా