సినీ పరిశ్రమకు విశాఖలోనూ బంగారు భవిత

10 Jun, 2015 00:26 IST|Sakshi
సినీ పరిశ్రమకు విశాఖలోనూ బంగారు భవిత

 తూర్పుగానుగూడెం (రాజానగరం) : రాష్ట్రాలు రెండుగా వేరుపడినా తెలుగువారంతా ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమంతా ఒక్కటేనని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తాను నిర్మించిన ‘కేరింత’ చిత్రం ఆడియో సక్సెస్ మీట్‌లో భాగంగా తూర్పుగానుగూడెంలోని ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్ మాదిరిగానే సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖలో కూడా ఉన్నాయన్నారు. అక్కడ కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు.
 
  ‘కేరింత’ సినిమా యువతను ఆకట్టునేలా ఉంటుందన్నారు. ఇది కాలేజీ లవ్ స్టోరీల బాపతు కాదని, సత్ప్రవర్తన కలిగిన మిత్రుడుంటే సహచరుల జీవితం కూడా అదే రూటులో పయనిస్తుందన్న ప్రధానాంశంతో దీనిని తీశామని అన్నారు. తమ బ్యానర్‌లో ‘కేరింత’ 19వ సినిమా అన్నారు. 2016లో అల్లు అర్జున్‌తో ఒక సినిమా తీయాలనే ఆలోచన ఉందన్నారు. అలాగే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయిధర్మతేజ హీరోగా తీస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయిందని, సునీల్ హీరోగా తీస్తున్న మరో చిత్రం షూటింగ్ దశలో ఉందన్నారు. ఈ రెండింటినీ సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు