అవ్వాచారికోన లోయలో ఎగసిపడుతున్న మంటలు

27 Jun, 2015 19:26 IST|Sakshi

తిరుమల: తిరుమలలోని అవ్వాచారికోన లోయలో శనివారం మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను ఎలా అదుపుచేయాలో తెలియక అటవీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దట్టమైన అడవి కావడంతో ఫైరింజన్లు వెళ్లే అవకాశం లేదు.

మంటలు వాటంతట అవే ఆరిపోవాలి లేదా హెలికాప్టర్ల సహాయంతోనైనా మంటలను అదుపు చేయాలి. హెలికాప్టర్ల సహాయంతో మంటలను అదుపు చేయడమంటే ఆర్ధిక భారంతో కూడుకున్నది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు