గ్యారేజీలో అగ్ని ప్రమాదం

13 Aug, 2015 18:26 IST|Sakshi

చిత్తూరు(తిరుపతి) : తిరుపతి రేణిగుంట రోడ్డులోని మారుతీ సుజుకీ షోరూంకు సంబంధించిన భార్గవి గ్యారేజీలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. షోరూంకి సంబంధించిన కార్లన్నీ ఈ భార్గవి బాడీ షాప్‌లో రిపేర్ చేస్తుంటారు.

కాగా ఈ గ్యారేజీ వెనుక వేస్ట్ ఆయిల్ ఉంటుంది. దానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే రెండు ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపుచేశాయి.

మరిన్ని వార్తలు