టెలిఫోన్‌ ఎక్స్చేంజిలో అగ్ని ప్రమాదం

18 Apr, 2019 13:09 IST|Sakshi
పిఠాపురంలో టెలిఫోన్‌ ఎక్సే్ఛంజ్‌లో కాలిపోయిన ఇంటర్‌నెట్‌ పరికరాలు

తూర్పుగోదావరి, పిఠాపురం: పిఠాపురంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్సే్ఛంజ్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో టెక్నికల్‌ టెర్మినల్‌ కాలి బూడిదైంది. ఇంటర్‌ నెట్‌ కేబుల్స్‌ ఇతర పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.రెండు కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించింది. నియోజకవర్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు అందించే ముఖ్య కార్యాలయంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంతో ఇంటర్‌నెట్‌ సేవలు, సెల్‌వన్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంటర్‌ నెట్‌ సేవలు ఆగిపోవడంతో పిఠాపురం నియోజకవర్గంలో వివిధ బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచి పోవడంతో ఇటు బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులతో పాటు బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఎక్సే్ఛంజ్‌ పరిధిలో ఉన్న సుమారు పది వేల సెల్‌వన్‌ కనెక్షన్లు,  వెయ్యికి పైగా ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు ఆగిపోయాయి. సుమారు నాలుగు గంటల అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను తాత్కాలికంగా పునరుద్ధరించడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. పిఠాపురం పట్టణంతో పాటు, గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో సెల్‌ఫోన్లు మూగబోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టెలికం ఏడీఈ గౌరీ శంకర్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామని విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్ల కార్యాలయంలో ఏసీలు కాలిపోయి తద్వారా కేబుల్స్‌ పరికరాలు కాలిపోయినట్టు ఆయన తెలిపారు.

ఫైర్‌ సేఫ్టీ ఏమైనట్టు?
సాధారణంగా టెలిఫోన్‌ ఎక్సే్ఛంజ్‌లో రూ.కోట్ల విలువైనవి పరికరాలు ఉన్నా ఫైర్‌సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఫైర్‌ జరిగిన వెంటనే వాటిని అదుపు చేసే ప్రయత్నం చేయక కార్యాలయంలోని అన్నీ కాలిబూడిదయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

ఆ సమయంలో ఎవరూ లేరా?
ప్రమాద సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరని ఉదయం మామూలు సమయానికి డ్యూటీలకు వచ్చిన సిబ్బంది తలుపులు తీసి చూడగా ప్రమాదం జరిగినట్టు తెలిసిందని స్థానికులు చెబుతున్నారు. 24 గంటలూ పనిచేయాల్సిన కార్యాలయంలో ఏ ఒక్కరూ లేకుండా తాళాలు వేసి వెళ్లిపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాంకేతిక సమస్య వల్ల ఫలితం తేలకపోతే రీపోలింగ్‌

వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై ఆదేశాలు ఇవ్వలేం..

కరువు రైతులకు బాబు వంచన

కష్టాలు మాకు..కాసులు మీకా?

రేపే కౌంటింగ్‌

పోలీసు స్టేషన్‌ ముందు గర్భవతి ఆందోళన

‘ఫలితాలు కరెక్టుగా ఇవ్వడమే మా లక్ష్యం’

హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు

ఆయన ‘జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడు

‘రౌడిషీటర్లని ఎందుకు అనుమతించారో చెప్పాలి’

‘ఓటమి తర్వాత ఏపీ ప్రజల్ని తిట్టకండి’

‘జార్ఖండ్‌ అలా చేస్తే.. ఏపీ మాత్రం అందుకు విరుద్ధం’

‘నేరచరితులకు అనుమతి లేదు’

‘బాబు లక్ష శాతం ఓడిపోవడం ఖాయం’

‘కౌంటింగ్‌ తర్వాత కూడా రీపోలింగ్‌ అవకాశాలు’

48 గంటలే.. 

లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

‘టీడీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారు’

‘చంద్రబాబుకు అర్జెంట్‌గా క్షార సూత్ర అవసరం’

‘నారా, నందమూరి పార్టీగా టీడీపీ’

‘వైఎస్సార్‌సీపీకి 150 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు’

రెండో ప్రపంచ యుద్ధం నాటి తుపాకులు లభ్యం

పంట పొలాల్లో ‘మహర్షి’ బృందం

‘2 రోజుల్లో అధికారంలోకి వైఎస్సార్‌సీపీ’

ఇక 2 రోజులే!

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు

గబ్బర్‌సింగ్‌ ఎక్కడ?

వసూళ్ల రాజాలు

ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి