పేదల బతుకు బుగ్గి

22 May, 2016 08:03 IST|Sakshi
పేదల బతుకు బుగ్గి

ఎమ్మిగనూరులో అగ్నిప్రమాదం
తొమ్మిది గుడిసెలు దగ్ధం
కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
 

ఎమ్మిగనూరు టౌన్/రూరల్‌ః పట్టణంలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తొమ్మిది గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఫలితంగా బాధిత పేద కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ధనుంజయకు చెంది న గుడిసె(హోటల్)లో అర్ధరాత్రి సమయంలో షార్ట్‌సర్క్యూట్ సంభవించిం ది. ఈ కారణంగా చెలరేగిన మంటలు కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇతర గుడిసెలకు వ్యాపించాయి. విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే పిల్లాపాపలతో వీధుల్లోకి రావడంతో ప్రాణ నష్టం తప్పింది. గుడిసెల్లో గ్యాస్ సిలెం డర్లుండడంతో మంటల ఉద్ధృతి మరిం త తీవ్రమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చా రు.

ఘటనలో ధనుంజయ, నాగేం ద్రమ్మ, సూరి, చంద్ర, ఈరమ్మ, ఈశ్వరమ్మ, మాలంబీ, మాబూబీ, గుల్జర్‌కు చెందిన 9గుడిసెలు కాలిపోయాయి.  వంట సామాగ్రి, తిండి గింజలు, బట్టలు, ఇతర వస్తువులు బూడిద కావడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. కుమార్తె పెళ్లి కోసం సిద్ధం చేసి పెట్టుకున్న రూ. 50వేల నగదు, 5 తులాల బంగారం కాలిపోయిందని బాధితుడు సూరి విలపించాడు.  
 
 
ఆలస్యంగా అగ్నిమాపక సిబ్బంది..  
అగ్నిమాపక కేంద్రం వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో 101 నెంబర్ మూగబోయింది. బాధితులు ఆ నెంబర్‌కు డయల్ చేయగా  కర్నూలు అగ్నిమాపక కేంద్రానికి కాల్ వెళ్లడం, వారి నుంచి సమాచారం అందుకున్న తర్వాత స్థానిక ఫైర్ సిబ్బంది వచ్చే సరికి ఆలస్యం జరిగింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మరిన్ని వార్తలు