ట్రావెల్స్‌ బస్సులో పొగలు...త్రుటిలో తప్పిన ప్రమాదం

18 Dec, 2017 08:35 IST|Sakshi

సాక్షి, మహానంది : గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రయివేట్‌ బస్సు ఇంజన్‌ వెనుక మంటలు వ్యాపించాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె వద్ద ఆదివారం అర‍్థరాత్రి  చోటు చేసుకొంది. గిద్దలూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మేఘన ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరబాద్‌కు బయలుదేరింది. ఈ బస్సులో గిద్దలూరు నుంచి హైదరబాద్‌కు సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్లమల ఘాట్‌లోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద ఆగి భోజనాలు చేసీ బయల్దేరారు. అనంతరం గాజులపల్లె సమీపంలోకి చేరగానే బస్సులోని ఎయిర్‌ కంప్రెషర్‌ వద్ద మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు వెంటనే గుర్తించి డ్రైవర్‌ శివ దృష్టికి తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఇంజన్‌ వెనక మంటలు వ్యాపించడంతో బస్సును గాజులపల్లె మెట్ట వద్ద నిలిపి మంటలను ఆర్పేశారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. 

మరిన్ని వార్తలు