భగ్గుమన్న వామపక్షాలు, కాంగ్రెస్

24 Oct, 2015 02:40 IST|Sakshi
భగ్గుమన్న వామపక్షాలు, కాంగ్రెస్

పలుచోట్ల సీఎం, పీఎంల దిష్టిబొమ్మల దహనం
కాకినాడ : ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని, ముఖ్యమంత్రుల తీరుపై కాంగ్రెస్, వామపక్షా లు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వారి దిష్టిబొమ్మలను దహ నం చేయడంతో పాటు పలుచోట్ల ధర్నాలు చేశారు. రాజమండ్రిలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ చంద్రబాబు, మోదీలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పంతం నానాజీ ఆధ్వర్యంలో కల్పనా సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కంపర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తపేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. గోకవరంలో డీసీసీ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు ఆ ధ్వర్యంలో ధర్నా చేశారు. అమలాపురంలో కాంగ్రెస్ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రంపచోడవరంలో కాంగ్రెస్ నేత కె.సుధాకరబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాకినాడలో కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పిఠాపురంలో సీపీఐ నే త కోరాకుల సింహాచలం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

పెద్దాపురంలో సీపీఐ నేతలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రామచంద్రపురంలో సీపీఐ, సీపీఎం నేతలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉండవల్లి గోపాలరా వు, ఎన్.రాము, శారదాదేవి, పి.జానకీరాం తది తరులు పాల్గొన్నారు. అమలాపురంలో సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో గడియారస్తంభం సెంట ర్లో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజోలులో సీపీఐ నేత దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండపేటలో వామపక్షాల ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు