స్వాతంత్య్రోద్యమంలో మమేకం

28 Mar, 2014 02:50 IST|Sakshi

 తొలి ఎంపీగా రహంతుల్లా గుర్తింపు

అనంతపురం టౌన్  న్యూస్‌లైన్, స్వాతంత్రోద్యమంలో భాగస్వాములైన ముస్లిం నేతలలో అనంతపురానికి చెందిన  కెఎం రహంతుల్లా ఒకరు. 1940లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో విజయవాడ నుంచి బరిలోకి దిగి అప్పటికే పేరు ప్రఖ్యాతలు గడించిన ఖుద్దూస్‌ను ఓడించి అనంత కీర్తిని చాటారు. స్వాతంత్య్రానంతరం తొలి పార్లమెంటుకు కూడా ఎన్నిక కావడం విశేషం. మహాత్మాగాంధీ జిల్లాకు వచ్చినపుడు తాడిపత్రిలో ఆయన వెంట నడిచారు. తొలి కేంద్ర విద్యాశాఖామంత్రి అబ్ధుల్ కలామ్ ఆజాద్, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి.

 

అనంతపురం నగరంలో టవర్‌క్లాక్‌ను ప్రారంభించడానికి అనంతకు వచ్చిన జవహర్‌లాల్ నెహ్రూ రహంతుల్లాతోనే ఉన్నారు. ఆయన కుమారుడు సైఫుల్లా మాజీ రాజ్యసభ సభ్యుడు. మరో కుమారుడు  షఫీవుల్లా ప్రస్తుతం ముతవల్లీగా ఉన్నారు. స్వాతంత్య్ర కాలం నాటి అపురూపమైన వస్తువులు, లేఖనాలు ఇప్పటికీ షఫీవుల్లా వద్ద భధ్రంగా ఉన్నాయి. తొలి ఎంపీ జ్ఞాపకాలను మ్యూజియంలో భద్రపరచనున్నట్లు ఆయన తెలిపారు.    

మరిన్ని వార్తలు