స్పీకర్‌కు ఘనస్వాగతం

21 Jun, 2019 11:08 IST|Sakshi
స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం

శాసనసభ స్పీకర్‌ హోదాలో తొలిసారి విశాఖకు తమ్మినేని

ఎయిర్‌పోర్టులో పార్టీ నేతల ఆత్మీయ స్వాగతం

సమన్వయంతో అసెంబ్లీ నిర్వహిస్తా

ఈస్ట్‌పాయింట్‌ కాలనీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు

సాక్షి, ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ)/మద్దిలపాలెం(విశాఖ తూర్పు): శాసన సభలో ప్రజల సమస్యలు వినిపించేందుకే తొలి ప్రాధాన్యమిస్తానని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యులందరినీ సమన్వయపరుస్తూ ప్రాధాన్యతను అనుసరించి అవకాశం కల్పిస్తానని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా విశాఖ వచ్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో రావడంతో ఎయిర్‌పోర్ట్‌ జనసంద్రంగా మారింది. ఆయన్ను గజమాలలు, పుష్పగుచ్ఛాలు, శాలువతో సత్కరించారు.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాగానే ఉత్తరాంధ్ర బొబ్బిలి అంటూ నినాదాలు చేశారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అనుచరులు గజమాలతో సత్కరించి, వెండి కిరీటం బహూకరించారు. తననకు కలిసేందుకు వచ్చిన వారికి స్పీకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్, సీపాన రాము, కూటికుప్పల సూర్యారావు, కేకే రాజు, సనపల చంద్రమౌళి, పేడాడ కృష్ణారావు, భగాతి విజయ్, సింగుపురం మోహనరావు, సనపల చిన్నబాబు, తిప్పల నాగిరెడ్డి అనురులు దొడ్డి రమణ, తుంపాల తాతారావు, అప్పల రెడ్డి, మంత్రి మంజుల, శాంతి తదితరులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

షిర్డీసాయి మందిరంలో స్పీకర్‌ దంపతుల పూజలు 
ఈస్ట్‌పాయింట్‌ కాలనీలోని షిర్డీ సాయి మందిరంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, షిర్డీసాయి మందిరం ప్రతినిధులు అబ్బు, మణిలతోపాటు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వంశీకృష్ణ స్పీకర్‌కు శాలువకప్పి సత్కరించారు. స్పీకర్‌ దంపతులకు మందిరం ప్రతిని«ధి అబ్బు షిర్డీసాయి ప్రతిమను బహూకరించారు. అనంతరం మందిరంలోనే స్పీకర్‌ దంపతులు ప్రసాదం స్వీకరించారు.

 


ఈస్ట్‌ పాయింట్‌ షిర్డీ సాయిమందిరంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతుల పూజలు 

వినతులు
తమ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు స్పీకర్‌కు వినతిపత్రం అందజేశారు. బాలల హక్కులను కాపాడేలా చట్టాలను పక్కాగా అమలు చేయాలని చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం రాషŠట్ర అధ్యక్షుడు గొండు సీతారాం కోరారు.
 
కృతజ్ఞతలు
చాలీచాలని తమ వేతనాన్ని 18వేలకు పెంచి, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమ బతుకుల్లో వెలుగులు నింపారని పారిశుద్ధ్య కార్మికులు స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని స్పీకర్‌ వారికి సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం, సనపల చంద్రమౌళి, సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు జి.రవిరెడ్డి, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు వెంపడి శ్రీనివాస్‌రెడ్డి, బయిన సునీల్, సనపల త్రినా«థ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు