చేపలకు షాక్.. వేట చూస్తే షేక్

7 Aug, 2015 02:33 IST|Sakshi
విద్యుత్‌వైరుతో గెడ్డలో చేపలు పడుతున్న దృశ్యం, (ఇన్‌సెట్‌లో) విద్యుత్ స్తంభం

విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని పలు గ్రామాల గిరిజనులు ప్రమాదకర స్థితిలో విద్యుత్ వైర్లతో చేపల వేట సాగిస్తున్నారు. మండలంలోని సురాపాడు ఆనకట్ట, అడారు కాలువ వద్ద గురువారం ఈ దృశ్యం ‘సాక్షి’ కంటపడింది. అక్కడున్న విద్యుత్‌స్తంభాల వైర్లకు జీఐ వైరు(ఇనుము)ను కర్రతో తగిలించి కాలువ, ఆనకట్ట మధ్యలో కొంతదూరం పాటు మరికొన్ని కర్రలను ఏర్పాటు చేశారు. వాటికి జీఐవైరు ద్వారా విద్యుత్ సరఫరా అందేలా చేశారు.

దీంతో విద్యుత్‌సరఫరా ఉన్న వైరుకు తగిలిన చేపలు షాక్‌కు గురవుతుండడంతో వాటిని పడుతున్నారు. ప్రమాదకరమైన ఈ వేటపై అధికారులు దృష్టిసారించాల్సి ఉంది.    - మక్కువ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు