మత్స్యశాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు !

20 Aug, 2014 03:00 IST|Sakshi

సాక్షి, ఏలూరు :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలిచ్చారు కలెక్టర్ కాటమనేని భాస్కర్. ఏలూరు మండలం మాదేపల్లిలో మంగళవారం నిర్వహించిన సదస్సుకు హాజరైన కలెక్టర్ అక్కడ మత్స్యశాఖ అధికారులు ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉండాల్సిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ఆ శాఖ డెప్యూటీ డెరైక్టర్ వీవీ కృష్ణమూర్తిని ఆదేశించారు.
 
దీంతో మత్స్య అభివృద్ధి అధికారి స్టీవెన్‌రాయ్‌కు షోకాజ్ నోటీసు జారీచేసినట్టు డెప్యూటీ డెరైక్టర్ కృష్ణమూర్తి మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలి పారు. తాను క్షేత్ర పరిశీలనకు వెళ్లి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుండటం వల్ల సమావేశానికి వెళ్లడం ఆలస్యమైందని స్టీవెన్‌రాయ్ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఆయన క్షేత్ర పరి శీలనకు వెళ్లిన మాట వాస్తవమే అయినా సమావేశానికి అరగంట ఆలస్యంగా రావడంతో చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారని కృష్ణమూర్తి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు