బోటు తిరగబడి మత్స్యకారుడు మృతి

13 Dec, 2015 17:59 IST|Sakshi

కవిటి (శ్రీకాకుళం) : సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు బోటు తిరగబడి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన వి.ముకుంద(38) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఐదుగురు మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో బోటు బోల్తా కొట్టడంతో.. నీట మునిగి మృతిచెందాడు. దీంతో తోటి మత్స్యకారులు అతని మృతదేహాన్ని తీరానికి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు