వల పండింది..!

17 Sep, 2018 11:50 IST|Sakshi
టేకు చేపలు తాళ్లతో ఒడ్డుకు చేరుస్తున్న మత్య్సకారులు

మత్య్సకారుల వలకు చిక్కిన 500 కిలోల టేకు చేప

ప్రకాశం, చీరాల టౌన్‌: మత్య్సకారుల వలకు చేపలు చిక్కితే ఆనందం. అదే భారీ చేప చిక్కితే దాన్ని ఒడ్డుకు చేర్చుకోవడమూ కష్టమే.  వాడరేవుకు చెందిన నూకాలు బృందం శ«నివారం ఉదయం వేటకు వెళ్లింది. నూకాలు బృందానికి 500 కిలోల బరువు ఉన్న టేకు చేపతో పాటుగా 200 కిలోల టేకు చేప పిల్లలు చిక్కాయి. అయితే వలకు చేపకు చిక్కినా తమకు కష్టం తప్పదని మత్య్సకారులు చెబుతున్నారు. వలలో చిక్కిన టేకు చేపలను తీరం ఒడ్డున వేలం వేసి అమ్మకాలు చేశారు.

చీరాల టౌన్‌: గంగపుత్రులకు ఆదివారం కలిసొచ్చింది. శనివారం ఉదయం, రాత్రికి వేటకు వెళ్లిన వాడరేవు మత్య్సకారులకు అధిక మొత్తంలో చేపలు, రొయ్యలు, పీతలు వలలకు చిక్కడంతో మత్య్సకారులు ఆనందం వ్యక్తం చేశారు. కూన, రొయ్యలు, పారల, జీలా, పండుగప్ప, చందువాలు, తోక చేపలు, గురకలు, ముక్కుసూనా చేపలు లభించడంతో తీరం ఒడ్డు అంతా కొనుగోళ్లు, అమ్మకాలతో కిక్కిరిసిపోయింది. చీరాల వాడరేవు నుంచి సముద్ర సంపదను చెన్నై, కోల్‌కతా, మైసూరు, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ముఖ్య పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. మత్య్స సంపదను తీరం ఒడ్డునే వేలం పాటలో విక్రయించి మత్య్సకారులు సంతృప్తి చెందారు. అధిక మొత్తంలో మత్య్స సంపద లభించడంతో కొంత ఆనందంగా ఉన్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏడాదంతా మత్స్య సంపద అధికంగా లభించి తమ బతుకులు మెరుగుపర్చాలని మత్స్యకారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు