విద్యుత్ షాక్: రైతు కుటుంబంలో ఐదుగురి మృతి

28 Nov, 2014 15:52 IST|Sakshi
విద్యుత్ షాక్: రైతు కుటుంబంలో ఐదుగురి మృతి

విద్యుత్ కష్టాలు ఓ రైతు కుటుంబంలో ఐదుగురిని బలిగొన్నాయి. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వీడపనకల్ మండలం చీకలగురి గ్రామంలో పొలంలో చెడిపోయిన విద్యుత్ కనెక్షన్ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

వైరును నిలబెట్టేందుకు పైపును రైతు, కుటుంబ సభ్యులు కలిసి ఎత్తుతున్నారు. కొత్త బోరు తీసి పైపు ఎత్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పైపు 11 కేవీ వైరుకు తగలడంతో రైతు రేవణ్ణ, ఆయన ఇద్దరు కొడుకులు ఎర్రిస్వామి, బ్రహ్మయ్య, రేవణ్ణ మనవడు రాజశేఖర్ (17), మరో బంధువు వీరేంద్ర అక్కడిక్కడే మరణించారు.

 

ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. విద్యుత్ కష్టాలు ఓ రైతు కుటుంబంలో ఐదుగురిని బలికొనడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జగన్ తెలిపారు.

మరిన్ని వార్తలు