చార్జీల ‘విమాన’ మోత

26 Aug, 2013 06:30 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: సీమాం ధ్రలో కొనసాగుతున్న సమ్మె విమానయాన సంస్థలకు కాసులు కురిపిస్తోంది. రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో విమానాల్లో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో విమాన చార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావడానికి ఆదివారం బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు రూ.12 వేల వరకు చార్జీలు వసూలు చేశారు. సాధారణ సమయాల్లో ఈ చార్జీ రూ.3వేల నుంచి రూ.4 వేలలోపు మాత్రమే ఉంటుంది.
 
 మరోవైపు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు డిమాండ్‌ను బట్టి కనిష్టంగా రూ.నాలుగు వేల నుంచి గరిష్టంగా రూ.8,700 వేల వరకు ఎయిర్‌లైన్స్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. సాధారణ సమయాల్లో ఈ చార్జీ కేవలం రూ.2,600 మాత్రమే. ఇక వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి చార్జీ రూ.2,700 కాగా పరిస్థితులను బట్టి విమానయాన సంస్థలు రూ.4,700 నుంచి రూ.9 వేల వరకు వసూలు చేస్తున్నాయి. మూడు, నాలుగు రోజులు ముందుగా బుక్ చేసుకున్న వారికే టికెట్లు లభిస్తున్నాయి.

మరిన్ని వార్తలు