నిలకడగా కృష్ణమ్మ 

19 Jul, 2020 03:24 IST|Sakshi

శ్రీశైలం జలాశయంలోకి 89,731 క్యూసెక్కుల ప్రవాహం 

60.10 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ 

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలోకి  శనివారం సాయంత్రం 6 గంటలకు 89,731 క్యూసెక్కులు చేరుతుండటంతో.. నీటి మట్టం 838.8 అడుగులకు చేరింది. నీటి నిల్వ 60.10 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నిండాలంటే ఇంకా 155 టీఎంసీలు అవసరం.

► జూరాల ప్రాజెక్టులోకి 86,280 క్యూసెక్కులు చేరతుండగా.. స్పిల్‌వే వద్ద  7 గేట్లు ఎత్తి, విద్యుత్‌ కేంద్రం ద్వారా 84 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
► జూరాల నుంచి వస్తున్న జలాలకు హంద్రీ, తుంగభద్ర జలాలు జత కలవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 89,731 క్యూసెక్కులు చేరుతున్నాయి.
► ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 4,502 క్యూసెక్కులు వదిలి 12,907 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గోదావరిలో స్థిరంగా..
► గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 56,039 క్యూసెక్కులు చేరుతుండగా.. 55,539 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
► వంశధార నదిలో వరద ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీలోకి 2,685 క్యూసెక్కులు చేరుతుండగా 2,391 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు.

>
మరిన్ని వార్తలు