వరద తగ్గింది

19 Aug, 2019 04:28 IST|Sakshi

వర్షాలు తెరిపివ్వడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి తగ్గిన వరద

నేటినుంచి ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం మరింత తగ్గే అవకాశం

గోదావరికీ తగ్గిన ఇన్‌ఫ్లో

స్థిరంగా వంశధార

సాక్షి, అమరావతి: వరద నీటితో ఉరకలెత్తిన కృష్ణా నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 5.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 70 గేట్లు ఎత్తి 6.16 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. శనివారంతో పోలిస్తే ఆదివారం ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి వచ్చే వరద భారీగా తగ్గింది. ఆల్మట్టిలోకి 2.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. నారాయణపూర్‌లోకి 2 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

భీమానదిలో ప్రవాహం కొంత పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 12,351 క్యూసెక్కులు వస్తుండగా.. 15,590 క్యూసెక్కులను కృష్ణాలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్ట్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.32 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 5.98 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 4.73 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4.24 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 5.13 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలలోకి వచ్చే వరద సోమవారం నుంచి తగ్గుముఖం పట్టనుంది.

తగ్గిన గోదావరి
ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపివ్వడంతో ఆదివారం గోదావరిలోకి వచ్చే ప్రవాహం తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాయంత్రం 6 గంటలకు 4.81 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. అంతే స్థాయిలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 13,129 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక ఇంటింటి సర్వే

ప్రధానితో కలిసి చంద్రయాన్‌-2 చూసొద్దామా..!

పృథ్వీరాజ్‌కు సవాల్‌గా ఎస్వీబీసీలో డీవీడీల గోల..

ఠంచనుగా పింఛన్‌

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

అక్రమార్కులకు ముచ్చెమటలు

కేశవా.. ఈ పాపం నీది కాదా!

అమెరికాలో అద్భుత స్పందన

సోషల్‌ మీడియాలో ఆర్కేకు బెదిరింపులు

వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నేతల దాడి

అధికారులు–వ్యాపారుల కుమ్మక్కు

రూ. 472 కోట్ల సేవా పన్ను ఎగ్గొట్టారు

ముంపులోనే లంక గ్రామాలు!

ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి

రూ.311 కోట్లకు బురిడీ

అక్టోబరు 27 నుండి ఢిల్లీ సాయంత్రం సర్వీస్‌ 

కూలిన వినాయకుడి మండపం 

ఈనాటి ముఖ్యాంశాలు

మినరల్‌ వాటర్‌ అడిగామన్నది అబద్ధం..

‘ఏపీ ఎన్‌జీవో చేస్తున్న ప్రచారం అవాస్తవం’

‘తూర్పు’న ఘోర రోడ్డు ప్రమాదం

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌

టీడీపీకి యామిని గుడ్‌ బై!

మీ కోసం సీఎంతో చర్చిస్తా : ఆళ్ల నాని

ప్రజారోగ్యం పణంగా పెట్టి..

అర్హులకు ఏదీ దక్కనివ్వలేదు..!

పోలీసులను ఆశ్రయించిన మంగళగిరి ఎమ్మెల్యే

ఈ రాజా చెయ్యి వేస్తే అంతా మంచే

అమెరికాలో మార్మోగుతున్న ప్రజా విజయం పాట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

ఏ కథకైనా  ఎమోషన్సే ముఖ్యం

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక