మారని గీత

13 Jul, 2014 00:24 IST|Sakshi

పిట్టలవానిపాలెం: ప్రాణాలను పణంగా పెట్టి.. ఎత్తై చెట్లక్కి.. కల్లు తీసే గీత కార్మికుల బతుకులు మాత్రం అథఃపాతాళంలోనే ఉన్నారుు. ఎందరు పాలకులు మారినా.. వారి తలరాతలు మాత్రం మారడం లేదు. వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది. తాటి చెట్లు తరిగిపోతుండటం, చెట్ట అద్దెలు పెరిగిపోతుండటం, కల్లు దిగుబడి తోపాటు దీనిని తాగేవారు తగ్గిపోతుండటంతో గీత కార్మికుల కుటుంబాలు పూట గడవక ఆష్టకష్టాలు పడుతున్నారుు.
 
 బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో రెండు వేల మందికిపైగా గీత కార్మికులు ఉన్నారు. వీరంతా వంశపారంపర్యంగా వస్తున్న కల్లుగీత వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటవటంతోపాటు కల్లు తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో ఆదాయం చాలక ఇబ్బందులు పడుతున్నారు.
 
 రియల్ వ్యాపారుల దెబ్బ..
 రియల్ ఎస్టేట్ వ్యాపారుల కారణంగా గీత కార్మికుల కష్టాలు మరింత పెరిగారుు. గతంలో పొలాల గట్ల వెంబడి, బీడు భూముల్లో ఎక్కడపడితే అక్కడ తాటి తోపులు ఉండేవి. భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ఇళ్ల ప్లాట్లుగా మార్చేందుకు గట్లపై ఉన్న తాటి చెట్లను తొలగించేస్తున్నారు. దీంతో రోజు మొత్తం కష్టపడినా రూ.200 కూడా రావడం లేదని గీత కార్మికులు వాపోతున్నారు.
 
 మిన్నంటిన చెట్ల అద్దెలు
 తాటి చెట్ల సంఖ్య తగ్గిపోవటంతో వాటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నారుు. ఉన్న కొద్ది చెట్ల కోసం కార్మికులు పోటీ పడుతుండటంతో యజమానులు అద్దెలు పెంచేస్తున్నారు. గతంలో అసలు అద్దెలే ఉండేవి కాదు. ప్రస్తుతం ఆరు నెలల కాలానికి చెట్టుకు రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లించాల్సి వస్తోంది.
 
 బీమా పథకంపై ప్రచారం కరువు.. గీత కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకం గురించి చాలామందికి తెలియనే తెలియదు. ప్రచారం లోపమే ఇందుకు కారణం. చెట్టు మీద నుంచి కార్మికుడు ప్రమాదవశాత్తు పడి మరణిస్తే బీమా కింద కుటుంబ సభ్యులకు రూ.లక్ష, పూర్తి అంగవైకల్యం కలిగితే రూ.50 వేలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.25 వేలను ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకంపై కార్మికులకు అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది. పింఛను మొత్తం కూడా పెరగకపోవటం కార్మికులకు ఆవేదన కలిగిస్తోంది.
 
 నెలకు రూ.వెరుు్య ఇవ్వాలి
 పింఛనుగా నెలకు రూ.వెరుు్య ఇస్తామని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఉంటే ఇచ్చేవారే. ప్రస్తుతం రూ.200 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా కొందరికే అందుతోంది. ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పింఛన్లను పెంచుతామని చెబుతోంది. మా పింఛను గురించి మాత్రం మాట్లాడటం లేదు. మాకు నెలకు రూ.1000 పింఛను ఇవ్వాలి.
  -రాఘవులు, గీత కార్మికుడు
 

మరిన్ని వార్తలు