జీవన..ధార ఏదీ?

12 Jan, 2014 01:24 IST|Sakshi
  • శిథిలావస్థలో బావులు
  •  రక్షణ గోడలు లేక  ప్రమాదాలు
  •  గిరిజన రైతుల ఆందోళన
  •  
     అరకులోయ, న్యూస్‌లైన్: ఏజెన్సీలో రెండు దశాబ్దాల క్రితం సాగునీటి కోసం ‘జీవనధార’పథకంలో నిర్మిం చిన బావులు నిరుపయోగంగా మా రాయి. ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తయారయ్యాయి. వర్షాధారంగా పంటలు పండిస్తున్న గిరిజన రైతులను ప్రోత్సహించేందు కు సుమారు 20 ఏళ్ల క్రితం ఐటీడీఏ మండలానికి 70 నుంచి 90 చొప్పున బావులను నిర్మిం చింది. మన్యంలోని 11 మండలాల్లో నూ సుమారు 900 బావులు తవ్వా రు. ఒక్కో దానికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చుపెట్టింది. నీటిని తోడుకునేందుకు కొందరు రైతులకు డీజిల్ మోటారులను మంజూరు చే శారు.

    మరికొన్నింటికి మోటార్లు ఏ ర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చా రు. నాటి నుంచి నిర్వహణ బాగోలేక అవి క్రమే పీ శిథిలావస్థకు చేరాయి. కొద్ది రోజులు ఇవి బాగానే పనిచేశాయి. తర్వాత విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం, డీజిల్ మోటార్లు పనిచేయకపోవడంతో అన్నీ మూలకు చేరాయి. ప్రస్తుతం నేల బావులుగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బావులు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. వీటిల్లో నిండుగా నీరున్నప్పటికీ ఇవి ఇటు వ్యవసాయానికి, అటు తాగు నీటికి ఉపయోగపడడం లేదు. బావుల
     
    చుట్టూ రక్షణ గోడలు కూలిపోవడంతో మేతకు వెళ్లిన పశువులు, మేకలు ప్రమావవశాత్తు వాటిల్లో పడి మృతి చెందుతున్నాయి. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు స్పందించి జీవన్‌ధార బావులకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని గిరి రైతాంగం కోరుతోంది.
     

మరిన్ని వార్తలు