నిర్మాణ వేళ ట్రాఫిక్ ఇలా

6 Apr, 2018 11:53 IST|Sakshi

ఎన్‌ఏడీ  ప్రత్యామ్నాయ మార్గాలపై స్థానికుల సూచనలు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): నగరంలోనే అత్యంత రద్దీ అయిన ఎన్‌ఏడీ కూడలిలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఆటంకాలెన్నో అధిగమించి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు గురువారం భూమిపూజ కూడా జరిగింది. ఫ్లైఓవర్‌ పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యలు చాలావరకు తీరినట్లే.. అయితే అసలు సమస్య నిర్మాణ సమయంలోనే.. జిల్లాలోని 43 మండలాల్లో విశాఖ రూరల్, భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాలు మినహా మిగిలిన 39 మండలాలకు ఇదే ప్రధానమార్గం. మరి ఏళ్ల తరబడి సాగే నిర్మాణవేళ ట్రాఫిక్‌ మళ్లింపు అధికారులకు ఓ సవాల్‌ వంటిదనే చెప్పవచ్చు. దీనిపై ఉన్నతాధికారులు పలుమార్లు ఎన్‌ఏడీలో పర్యటించారు. ప్రత్యామ్నాయాలపై దృష్టినీ సారించారు. అయితే స్థానికులు కూడా కొన్ని మార్గాలను చెబుతున్నారు. వాటిపైనా అధికారులు ఓ మారు ఆలోచిస్తే కొంతవరకు ట్రాఫిక్‌ కష్టాలు తీరవచ్చు అంటున్నారు. ఆ వివరాలివి..

గాజువాక నుంచి వచ్చే వారికి ..
గాజువాక నుంచి నగరంలోకి వెళ్లేవారు షీలానగర్‌ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌ మీదుగా నగరంలోకి చేరుకోవచ్చు.
గాజువాక నుంచి పెందుర్తి వెళ్లేవారు షీలానగర్‌ నుంచి నరవ మీదుగా గోపాలపట్నం, పెందుర్తి చేరుకునే రహదారి ఉంది.
కాకానినగర్‌ వరకు వచ్చినట్లయితే ఎన్‌ఏడీ రాకుండా సాకేతపురం నుంచి దుర్గాపురం, అశోకా పార్క్‌ మీదుగా 104 ఏరియాకు చేరుకునే అవకాశం ఉంది.
విమాన్‌నగర్‌ నుంచి యల్లపువాని పాలెం, చంద్రనగర్‌ మీదుగా గోపాలపట్నం చేరుకోవచ్చు. అయితే ఈ మార్గంలో  ద్విచక్రవాహనాలు మినహా ఇతర వాహనాల రాకపోకలు కష్టం.
విమాన్‌నగర్‌ మీదుగా వెళ్లేందుకు పరిశీలనలో ఉన్న ఈ మార్గంలో వెళ్లాలంటే సుమారు 13 రైల్‌ ట్రాక్‌లు దాటాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గం బాజీ జంక్షన్‌ను పాత గోపాలపట్నానికి కలుపుతుంది. (ఇది ప్రయోజనం లేని రహదారి)

నగరం నుంచి గోపాలపట్నం రావాలంటే
నగరం నుంచి గోపాలపట్నం రావాలంటే ఎన్‌ఎస్టీఎల్‌ గోడ తొలగించి రహదారి నిర్మాణం చేపట్టాలి.
లేదంటే ఎన్‌ఎస్టీఎల్‌ అధికారుల అనుమతితో వారి ప్రధాన గేట్లలో నుంచి రాకపోకలకు అనుమతి పొందాలి.
సింహాచలం దేవస్థానం పెట్రోలింగ్‌ కోసం ఏర్పాటు చేసుకున్న కచ్చా రహదారిని ప్రయాణాలకు అనుగుణంగా తయారు చేస్తే మరో ప్రత్యమ్నాయ మార్గం అవుతుంది.
మర్రిపాలెం, కరాస ప్రాంతాల నుంచి గోపాలపట్నం, పెందుర్తి రావాలన్నా ఎన్‌ఎస్టీఎల్‌ రహదారిపై ఆధార పడాల్సిందే.

పెందుర్తి, గోపాలపట్నం ప్రాంతాల వారికి..
పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన మార్గం లేదు. వీరు వేపగుంట మీదుగా సింహాచలం, జైలు రోడ్డు గుండా హనుమంతవాక మీదుగా నగరానికి చేరుకోవాలి. లేదంటే ఎన్‌ఎస్టీఎల్‌ 80అడుగుల రోడ్డు వస్తే సులువవుతుంది.

ఎన్‌ఎస్టీఎల్‌ గోడ తొలగించిరోడ్డు నిర్మించాలి
ఎన్‌ఏడీ జంక్షన్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ సమయంలో ట్రాఫిక్‌ మళ్లించడం కష్టమే. అందులో ప్రధానమైనది ఎన్‌ఎస్టీఎల్‌ గోడ తొలగించి 80అడుగుల రహదారి నిర్మించడమే. ఈ రోడ్డు నిర్మాణంపై నాయకులు, అధికారులు చర్యలు ముమ్మరం చేయాలి.         –  రాజు, కరాసా

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింహగిరి.. భక్తఝరి

‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు

టీడీపీ ప్రభుత్వం నిండా ముంచింది..

ఎవరైనా బీజేపీలో చేరొచ్చు

ఆహాఏమిరుచి..అనరామైమరచి

గ్రామ సచివాలయ ఉద్యోగాలోచ్‌..!

కర్కశత్వానికి చిన్నారుల బలి

జీతాలు ఎగ్గొట్టిన టీడీపీ

విశాఖలో టీడీపీ పంచాయితీ

తిన్నది.. కరిగిద్దామిలా..!

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

బంధాన్ని మరిచి..ఇంటిని విడిచి...

అర్ధరాత్రి కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

సీఎం జగన్‌ స్పందనతో అక్రమాల పుట్ట కదులుతోంది

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

మంచి ఆహారంతోనే ఆరోగ్యం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

చెప్పుతో సమాధానమిచ్చినా మారలేదు

దేశాయ్‌ చెరువులో మట్టి దొంగలు 

మాట ఇస్తే.. మరచిపోడు

ఆ ఉత్తర్వులను రద్దు చేయండి

ఏపీ సెంట్రల్‌ వర్సిటీకి రూ.450 కోట్లు

నేడు ఆలయాల మూసివేత

ప్రాణాలు తీసిన స్టాపర్‌

మూగబోయిన విప్లవ గళం

కులాల మధ్య టీడీపీ చిచ్చు 

శునకంతో మార్జాలం.. బహు ఇంద్రజాలం

వైరల్‌.. రియల్‌ 

రైలు వచ్చిందా.. ప్రాణం గోవిందా! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం