బెజవాడను కమ్మేసిన పొగమంచు

7 Mar, 2018 09:06 IST|Sakshi
పొగమంచు కారణంగా జారిపడిన వాహనదారులు

విమానాల రాకపోక ఆలస్యం

సాక్షి, విజయవాడ : విజయవాడను మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ముంచేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేకువజామునే రోజు వారి కార్యక్రమాలు, జాగింగ్‌ చేసే పాదచారులు సైతం ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు తీవ్రంగా అలముకోవడంతో కొన్ని చోట్ల వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జారి కింద పడ్డారు.

విమానాల రాకపోక ఆలస్యం :
గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. హైదరాబాద్‌, బెంగుళూరు నుంచి రావాల్సిన స్పైస్‌జెట్‌, ఇండిగో, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన ట్రూజెట్‌ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు