సేఫ్టీ ఫిఫ్టీ

3 Aug, 2018 12:06 IST|Sakshi
రసాయనాలు కలిపి విక్రయిస్తున్న మామిడి పండ్లను పరిశీలిస్తున్న ఫుడ్‌సేఫ్టీ అధికారులు

కలుషితాహారంతో ప్రబలుతున్న వ్యాధులు

ఇష్టానుసారంగా ఆహార పదార్థాల తయారీ

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

క్వాలిటీ కంట్రోల్‌ అధికారి లేక పోవడంతో నిలిచిన తనిఖీలు

100కుపైగా దుకాణాల లైసెన్స్‌ల పెండింగ్‌

జిల్లాలో ఎక్కడ చూసినా అధిక శాతంలో కలుషిత ఆహార పదార్థాలనే విక్రయిస్తున్నారు. రంగులు, రసాయనాలు కలిపిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన వాటిని విక్రయిస్తుండటంతో ఎక్కువమంది అనారోగ్యంబారిన పడుతున్నారు. కలుషిత ఆహారం తినడంతో జీర్ణ, లివర్, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. అదేవిధంగా శరీరంలో అధిక ఫ్యాట్‌ చేరుకోవడంతో పాటు కేన్సర్‌ తదితర ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరు నగరంలో కొన్ని కార్పొరేట్‌ స్థాయి హోటళ్లలోనూ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగదారులకు పెట్టే పరిస్థితి నెలకొంది.  గతంలో ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో అనేక విషయాలు వెలుగు చూశాయి. నగరంలోని వివిధ హోటళ్లలో నిల్వ ఉంచిన వాటిని వినియోగదారులకు పెడుతున్నట్లు నిర్ధారించి కేసులు నమోదు చేశారు.

అధికారి లేక పోవడంతోనే..
జిల్లాలోని హోటల్స్, మాల్స్, పాల వ్యాపార కేంద్రాలు, ఆహార పదార్థాలు తయారు చేసే ఏ ప్రాంతాల్లో నైనా ఫుడ్‌కంట్రోల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అనుమానం వస్తే వాటి శాంపిల్స్‌ సేకరించాల్సి ఉంటుంది. కాగా ఇందుకోసం జిల్లాలో ఆహార నాణ్యతను పరిశీలించాల్సిన అధికారి లేక పోవడంతో తనిఖీలు చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లా ఫుడ్‌ కంట్రోల్‌ అధికారిగా ఉన్న హనుమంతరావు బదిలీపై నెల క్రితం విజయవాడ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెళ్లినప్పటి నుంచి ఇంత వరకు వేరే అధికారిని నియమించ లేదు. ఇన్‌చార్జి బాధ్యతలను ఎవరికీ కేటాయించలేదు. దీంతో కింద స్థాయి అధికారులు కూడా ఏమిచేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఆహార పదార్థాలు తనిఖీలు నిర్వహించేందుకు ముగ్గురు గెజిటెడ్‌ అధికారులు, ఇద్దరు నాన్‌గెజెటెడ్‌ అధికారులు మొత్తం ఐదుగురు అధికారులు ఉండాల్సి ఉంది. వీరిలో ముగ్గురు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. మిగిలిన ఇద్దరిని ఇంకా నియమించలేదు. వీరు కూడా నెల్లూరు, గూడూరు, కావలి పరిధి లోని ఆయా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిం చాల్సి ఉంది. తగినంత సిబ్బంది లేక పోవడంతో కూడా తనిఖీలు చేయలేని పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి.

70కు పైగా లైసెన్స్‌ల పెండింగ్‌
జిల్లాలో ఏ రకం ఆహార పదార్థాలను తయారు చేయాలనే ఆయా కేంద్రాలు ఫుడ్‌కంట్రోల్‌ అధికారి నుంచి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నెల్లూరులో     దాదాపుగా 70 కేంద్రాలకు పైగా  లైసెన్స్‌లుకోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో 30 మంది వరకు లైసెన్స్‌ల కోసం తిరుగుతున్నారు. లైసెన్స్‌లు ఇవ్వాల్సిన అధికారి లేక పోవడంతో ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.

120 కేసుల నమోదు
జిల్లాలో తినే ఆహారం, తాగేనీరు, తయారీ చేసే ప్రాంతాలు, ట్రాన్స్‌పోర్టు ప్రాంతాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులకు తనిఖీలు చేసే అధికారం ఉంది. ప్రధానంగా హోటల్స్, స్వీట్‌ షాపులు, పాలవిక్రయ కేంద్రాలు, పండ్లరసాల షాపులలో తనిఖీలు నిర్వహించాలి.  తనిఖీలు నిర్వహించిన సమయంలో సేకరించిన శాంపిల్స్‌ హైదరాబాద్‌లోని  ల్యాబ్‌కు పంపుతారు. శాంపిల్స్‌ రిపోర్టు వచ్చిన తరువాత సంబంధిత షాపు, హోటల్‌పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. కాగా వీటిలో రెండు రకాలుగా కేసులు నమోదు చేస్తారు. మొదటగా పండ్లపై రసాయనాలు ఉపయోగించడం, శీతల పానీయాలు కల్తీ, రంగుల కలిపిన ఆహార పదర్థాలు, దెబ్బతిన్న పండ్ల, స్వీట్లకు సంబంధించిన దుకాణాలపై మొదటి రకం కేసులు నమోదు చేస్తారు. ఈ  కేసులు ఇప్పటి వరకు 70 వరకు నమోదు చేశారు. రెండో రకంలో గుట్కా విక్రయాలు, స్టాకు ఉన్న పదార్థాల వంటి వాటిపై  ఇప్పటి వరకు 50 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిక ఇస్తారు. అదేవిధంగా గతంలో తొమ్మిది ప్రధాన హోటల్స్‌లో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కూడా నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

లైసెన్స్‌లు 30 శాతమే
ఆహార పదార్థాలు విక్రయాలు చేసే ప్రతి సంస్థ, దుకాణం, మాల్స్‌లు తప్పని సరిగా ఆహార భద్రతా ప్రమాణాల చట్టానికి సంబంధించి లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 లక్షల లోపు టర్నోవర్‌ చేస్తున్న షాపులు సంవత్సరానికి రూ.1,000, రూ.12 లక్షలకు పైన, రూ.20 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న వాళ్లు ఏడాదికి రూ.2 వేలు కట్టి లైసెన్స్‌ తీసుకోవాలి. ప్యాక్‌ చేసి బ్రాండ్‌ నేమ్‌ వేసుకునే వారు ఏడాదికి రూ.3 వేలు, వివిధ రకాల తయారీ యూనిట్‌లు రూ.5 వేలు కట్టి లైన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం వివిధ రకాల ఆహార పదార్థాలు విక్రయాలు చేసే దుకాణాలు, హోటల్స్, మాల్స్‌ అన్ని దాదాపుగా 10 వేలకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. వీటిలో కేవలం 30 శాతం మాత్రమే లైసెన్స్‌లు తీసుకుని ఉన్నారని అధికారులు చెబుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చిండమా..! : సీఎం జగన్‌

చినుకు పడితే చెరువే..

బాపట్లవాసికి జాతీయ అవార్డు!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

ఆ వంతెన మొత్తం అంధకారం

మేఘాలే తాకాయి.. ‘హిల్‌’ హైలెస్సా..

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

చీకటిని జయించిన రాజు

విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం

ఆ‘ఘనత’ చంద్రబాబుదే..!

దారి మరిచాడు..ఆరు కిలోమీటర్లు నడిచాడు

విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు?

అవనిగడ్డలో పెరిగిన పాముకాటు కేసులు!

కాటేసిన కరెంట్‌ తీగ

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

అక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌

నీట్‌లో సత్తా చాటిన సందీప్‌

రిసార్టులు, పార్కుల్లో అలంకరణకు ఈత చెట్లను..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

పద్నాలుగేళ్ల పోరాటం.. బతికేందుకు ఆరాటం 

‘నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’

మిషన్‌కు మత్తెక్కింది

ఓటీపీ చెప్పాడు.. లక్షలు వదిలించుకున్నాడు

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

సీబీఐ దాడి..జీఎస్టీ అధికారి అరెస్ట్‌ 

ఒకే సంస్థకు అన్ని పనులా!

రెవెన్యూ అధికారులే చంపేశారు

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

ట్రిపుల్‌ ఐటీ పూర్వ విద్యార్థికి లక్ష డాలర్ల వేతనం

టోల్‌ప్లాజా వద్ద 70 కేజీల గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..