బలపడుతున్న అల్పపీడనం

21 Jul, 2014 01:52 IST|Sakshi

 బలమైన ఈదురుగాలులు
 ఉత్తర కోస్తాకు భారీవర్ష సూచన
 
 సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి పూర్తిస్థాయి అల్పపీడనంగా మారుతుందని విశాఖలోని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా మధ్య కొనసాగుతున్న దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదరుగాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీవర్షాలు, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆదివారం ఉదయం వరకు కోస్తాలో సాలూరు, పాడేరుల్లో 3 సెం.మీ., చింపతల్లి, అరకు వ్యాలీ, శృంగవరపుకోట, పోలవరం, మెంటాడ, బొబ్బిలిల్లో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తెలంగాణలో ్లభూపాలపల్లిలో అత్యధికంగా 7 సెం.మీ., పేరూరు, వెంకటాపురం, ఏటూరునాగారంలలో 6 సెం.మీ., చింతూరు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, వెంకటాపూర్, ఖానాపూర్, చెన్నూర్, మంథని, కాళేశ్వరంలలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
 

మరిన్ని వార్తలు