శారదా పీఠాన్ని సందర్శించిన కృష్ణంరాజు

1 Feb, 2020 13:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ శారద పిఠంలో ఘనంగా నిర్వహిస్తున్న శారదపీఠం వార్షిక ఉత్సవాలు చివరి రోజుకు చేరాయి. నేటితో(శనివారం) ముగియనున్న ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కుటుంబ సమేతంగా శారదపిఠాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆయన దంపతులు పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులను కృష్ణంరాజు అందుకున్నారు. కాగా శాస్త్ర మహాసభలతో ముగించనున్న ఈ ఉత్సవాల్లో రాజశ్యామల యాగం, నివాస చతుర్వేద హావనం యాగాలను నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ప్రముఖ భాగవతులు విఠల్‌దాస్‌, మహరాజ్‌ బృందంతో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు