‘చంద్రబాబుకు ఆగస్టు సంక్షోభం తప్పదు’

14 Jun, 2016 18:20 IST|Sakshi

పాలకొల్లు టౌన్ (పశ్చిమ గోదావరి): ముద్రగడ తలపెట్టిన ఆమరణ దీక్ష విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనవసరమైన పట్టుదలకు పోతే ఆయనకు మరో ఆగస్ట్ సంక్షోభం తప్పదని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ జోగయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. ఆగస్ట్ సంక్షోభం తలెత్తితే చంద్రబాబు ప్రభుత్వం మనుగడకు ప్రమాదం వాటిల్లే విషయాన్ని కాదనలేమని అభిప్రాయపడ్డారు. వైద్య నిపుణుల నివేదికలను బట్టి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎటు దారితీస్తుందోననే ఆందోళన నెలకొందన్నారు.

ముద్రగడ పద్మనాభం మొండివైఖరి, పట్టుదల కలిగిన వ్యక్తి అన్నారు. ఈ సమస్య పరిష్కరించడం అంత సులువైనదిగా భావించలేమని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనగల ఒకే వ్యక్తి పవన్‌కల్యాణ్ అని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు మిత్రపక్షేయుడిగా.. ముద్రగడ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగల వ్యక్తిగా పవన్‌కల్యాణ్ ఒక్కరే దీనిని పరిష్కరించగలడన్నారు. ప్రజలందరి తరఫున పవన్‌ కల్యాణ్ రంగంలోకి దిగి సమస్య పరిష్కరించాలని జోగయ్య కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా