ఆ సెల్‌ఫోన్‌లోనే సగం సాక్ష్యాలు?

31 Oct, 2017 08:27 IST|Sakshi

గేదెల రాజు మొబైల్‌ కోసం పోలీసుల ఆరా

రెండు హత్య కేసుల 

విచారణలో కీలకం కానున్న సెల్‌ఫోన్‌

మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె, మాజీ ఎంపీపీ పద్మలత హత్య ఎలా జరిగింది? ఈ హత్య కోసం రౌడీషీటర్‌ గేదెల రాజుతో ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడారు? హత్య చేయడానికి డీల్‌ ఎంతకు కుదిరింది?

గేదెల రాజు హత్యకు గురికాక ముందు అతడితో ఎవరెవరు మాట్లాడారు. ఏం మాట్లాడారు? పద్మలత హత్య అనంతరం గేదల రాజుకు ఎవరు ఎంత నగదు అందజేశారు. ఆ తరువాత అతడిని వదిలించుకోవడానికి వేసిన పథకంలో ఇంకా ఎంతమంది ఉన్నారు?

ఇలాంటి ప్రశ్నలకు రౌడీషీటర్‌ గేదెలరాజు మొబైల్‌ ఫోన్‌ కీలకమైంది.  అతడి సెల్‌ ఫోన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతకీ ఆ ఫోన్‌ ఎవరివద్ద ఉందన్నæ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. 

గాజువాక: గాజువాకలోని క్షత్రియభేరి పత్రికా కార్యాలయానికి రావాల్సిం దిగా పత్రికాధిపతి భూపతిరాజు శ్రీనివాసరాజు ఫోన్‌ చేసి గేదెల రాజును పిలిచి నట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించిన విషయం తెలిసిందే. అప్పటికే అక్కడ మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న కిల్లర్లు గేదెల రాజు వెళ్లిన వెంటనే దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత గేదెలరాజు సెల్‌ఫోన్‌ ఏమైందన్న విషయంపై పోలీసులు తాజాగా దృష్టి సారించినట్టు బోగట్టా.

సెటిల్‌మెంట్లు, దందాల సందర్భంగా జరిగే ఫోన్‌ సంభాషణలను రికార్డు చేసుకొనే అలవాటు గేదెల రాజుకు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రికార్డు చేసిన వాయిస్‌లను తనకు అనుకూలంగా మార్చుకొని తన పనిని పూర్తి చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడని పేర్కొంటున్నారు. పద్మలత హత్య కేసులో రవిబాబు నుంచి తనకు రావాల్సిన డీల్‌ బకాయిని వసూలు చేసుకోవడానికి గేదెల రాజు ఉపయోగించిన ఫోన్‌ సంభాషణ రికార్డింగే అతడిని హత్య చేయడానికి కారణమైందని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులోనే ఒక నిర్ణయానికొచ్చారు. ఈ హత్య కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న రవి బా  బును, భూపతిరాజు శ్రీని వాసరాజును ఎదురెదురుగా కూ ర్చోబెట్టి విచారించాలని పోలీ సులు నిర్ణయించినట్టు తెలిసింది. పద్మలత హత్య నుంచి గేదెలరాజు హత్య వరకు చోటు చేసుకున్న వివిధ పరిణామాలు, హత్యకు వేసిన పథకాలు, సహకరించిన వ్యక్తులు, హత్యలకు నిధులు సమకూర్చినవారి వివరాలపై నిందితులిద్దరి నుంచీ ఏక కాలంలో వివరాలను రాబట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయిం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిబట్టు భూపతి రాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 2వ తేదీవరకు రవిబాబును విచా రించేందుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులపాటు అతడిని విచారించనున్నారు. ఆఖరి రెండు రోజుల్లోను ఇద్దరు నిందితులను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించిన అనంతరం భూపతిరాజు ను కోర్టులో హాజ రుపరిచే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

మరిన్ని వార్తలు