టీడీపీకి మాజీ ఎంపీటీసీ గుడ్‌బై

20 Dec, 2017 07:48 IST|Sakshi

 నేడు వైఎస్సార్‌సీపీలోకి చేరనున్న కుళ్లాయినాయక్‌

నల్లమాడ: మాజీ ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు డి.కుళ్లాయినాయక్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నల్లమాడలోని 30 పడకల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ పదవికి కూడా ఆయన రాజీనామా చేసినట్లు కుళ్లాయినాయక్‌ చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం (నేడు) నల్లమాడకు విచ్చేయనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు తెలిపారు. తనతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు వైఎస్సార్‌సీపీలో చేరతారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు