సీఎం సెక్రటరీనంటూ మాజీ క్రికెటర్‌ డబ్బులు డిమాండ్‌

30 Jul, 2019 15:45 IST|Sakshi

నెల్లూరు:  ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్సనల్‌ సెక్రటరీ పేరుతో మాజీ క్రికెటర్‌ నెల్లూరులోని కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంజీ స్థాయిలో ఆడిన మాజీ క్రికెటర్‌ నాగరాజు సీఎం పేరు చెప్పి రూ.3.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనపై ఇప్పటికే ఆరు కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారి గ్రామానికి చెందిన బుడమూరు నాగరాజు 2014లో నాన్‌స్టాప్‌గా 82 గంటల పాటు క్రికెట్‌ ఆడి గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించాడు. ఆతర్వాత విలాసవంత జీవితానికి అలవాటు పడి ప్రముఖల పేర్లను ఉపయోగించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే నెల్లూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు