కమలం గూటికి.. ఆదినారాయణరెడ్డి

22 Oct, 2019 06:12 IST|Sakshi
ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ నాయకలు

అధికారం లేకుంటే మనలేని మాజీమంత్రి

మద్దతుగా నిలవని అనుచరగణం

సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత 

చంద్రబాబు సూచనతోనే బీజేపీలోకి?

సాక్షి ప్రతినిధి కడప: అధికారం ఎక్కడ ఉంటే మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి అక్కడే ఉంటారన్న ప్రచారం మరోసారి నిజమైంది. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆది బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగినా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అడ్డుకోవడంతో ఆలస్యమైంది. నైతిక విలువలను ఏమాత్రం పట్టించుకోరని ఆది రా జకీయ శైలి చెబుతుంది. దివంగత నేత వైఎస్‌ అధికారంలో ఉన్నంతకాలం ఆయనవద్దే ఉన్నారు.  తరువాత టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన వైఎస్‌ జగన్‌ను కాదని చంద్రబాబు పంచన చేరారు. అధికారం పోయాక ఇప్పుడు బాబును వదిలేశారు. జగన్‌ పార్టీ ఎలాగూ  పార్టీలో  చేర్చుకోరని తెలియడంతో బీజేపీలో చేరిపోయారు.

ఆలస్యం..
టీడీపీలో చేరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేతతోపాటు  ఆ పార్టీ నేతలపై అవాకులు చెవాకులు పేల్చారు. అవికాస్తా వికటించాయి. జమ్మల మడుగుతోపాటు కడప పార్లమెంటరీ  ఓటర్లు గట్టిగా సమాధానం చెప్పారు. కొంతకాలంగా టీడీపీ అధినేత సూచనలతో బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రి సిద్ధమయ్యారు. అయితే పరిణామాలు అనుకూలించలేదు. వివిధ చర్చల నేపథ్యంలో ఎట్టకేలకు ఆలస్యంగా బీజేపీలో చేరగలిగారు. అనుచరగణమెవరూ బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరు. ముఖ్య అనుచరులు, సమీప బంధువులుకూడా ఆయనతో  కలిసి నడిచేందుకు ఇష్టపడడంలేదు. అధికారం లేకపోతే ఆయన ఉండలేరని ఆయన ధోరణి తెలిసినవారంతా చెబుతారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలను నడిపేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్వార్ధం కోసం  కింద క్యాడర్‌ ఏమైపోయినా పట్టించుకోరు. ఇప్పుడు ఆది మరోమారు తన సహజ రాజకీయ స్వభావాన్ని చాటుకున్నారు. 

దివంగత నేత వైఎస్‌ అనుచరుడిగా 2004,2009లో జమ్మలమడుగునుండి ఎన్నికయ్యారు. తరువాత జగన్‌మోహన్‌రెడ్డి టీంలో  2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ కుటుంబానికి  జమ్మల మడుగు నియోజకవర్గంతో బలమైన అనుబంధం ఉంది. గెలుపోటములు నిర్దేశించేది వైఎస్‌ కుటుంబ అభిమానులే. గెలిచాక పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జనం ఆయనకు గుణపాటం నేర్పారు. జమ్మలమడుగులో ఆయన బలపర్చిన సుబ్బారెడ్డిని ఓడించారు. కడప ఎంపీగా పోటీచేసి పరాజయం మూటగట్టుకున్నారు.  ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్‌ జగన్‌ దగ్గరకు రానిచ్చే అవకాశం లేకపోవడంతో  టీడీపీ షెల్టర్‌ జోన్‌గా సెలక్ట్‌ చేసిన బీజేపీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

బాబు మ్యాచ్‌ ఫిక్సింగ్‌
మనుగడకోసం తంటాలు పడుతున్న టీడీపీ నేతలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. చంద్రబాబే కీలక నేతలందరినీ బీజేపీలోకి పంపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఇదే పంథాలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.  ఇప్పుడు ఆదినారాయణరెడ్డి వంతయింది.  ఇన్నాళ్లు పార్టీలో అన్నిరకాల పదవులు అనుభవించి నేతలు పార్టీని వీడి  వెళుతున్నా టీడీపీ నేతలెవరూ విమర్శిస్తున్న దాఖలాలు లేవు.  దీన్నిబట్టి  మ్యాచ్‌ పిక్సింగ్‌  వ్యవహారం ఇప్పుడు జనంలో హాట్‌ టాపిక్‌ గా మారింది.    
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డి అరెస్ట్‌

‘రివర్స్‌’ సక్సెస్‌ 

నాకే పాఠాలు చెబుతారా!

దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి జగన్‌

స్మగ్లింగ్‌కు 'రెడ్‌' సిగ్నల్‌ 

ఢిల్లీలో సీఎం బిజీబిజీ 

బుంగ మిర్చి.. బందరు కుచ్చి 

పోలవరం ఇక పరుగులు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఏడోసారి వరద

వడ్డీల కోసం.. అప్పులు

బోటు ముందుకు.. శకలాలు బయటకు 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

అర్చకుల కల సాకారం

విధి నిర్వహణలో వివక్ష చూపొద్దు

‘చంద్రబాబు సంస్కారహీనుడు’

మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్‌

40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి అంత బాధ ఎందుకో..?

10 రోజులు డెడ్‌లైన్‌ పెట్టాం: మంత్రి సురేష్‌

ఈనాటి ముఖ్యాంశాలు

గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు

అత్తింటి వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు

‘అందుకే లోకేష్‌ మతిలేని వ్యక్తిగా మారిపోయాడు’

రోప్‌తో పాటు ఊడొచ్చిన బోటు పైభాగం..

24న సూరంపల్లిలో సీఎం జగన్‌ పర్యటన

హోంగార్డులకు రూ.40 లక్షల బీమా

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కొడాలి నాని

కోర్టు కష్టాలు

పోలీసుల క్యాండిల్‌ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతీకార కథతో..

టాక్సీవాలా రీమేక్‌

కత్తి కంటే పదునైనది మెదడు

‘ఆమె’ రీమేక్‌ చేస్తారా?

ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు: సుప్రీం

మనిషిలో మరో కోణం